మరో సినిమా తో రానున్న “RX 100” బ్యూటీ

మరో సినిమా తో రానున్న “RX 100” బ్యూటీ

Payal Rajput

ఈమధ్య టాలీవుడ్ లో రిలీజ్ అయిన సినిమాల్లో సంచలన విజయం సాధించిన సినిమా  ‘RX 100’.వర్మ అసిసెంట్ అజయ్ భూపతి తన తొలి ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించడమే కాకుండా పెట్టుబడికి ఆరు రెట్ల రాబడి తీసుకొచ్చి ట్రేడ్ వర్గాలను షాక్ కు గురిచేసింది. దీంతో ఈ సినిమా డైరెక్టర్ తో పాటు హీరో హీరోయిన్లకు క్రేజ్ భారీగా పెరిగింది.

Also Read:—–ప్రభాస్ ని చూసి హీరోలు నేర్చుకోవాలి

payal rajput image,trendingandhra

ముఖ్యంగా ఈ సినిమాలో బోల్డ్ అవతారంతో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటించిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కు భారీగా ఆఫర్లు వస్తున్నాయట.  కానీ ఈ భామ కంటెంట్ ఉన్న పాత్రల కోసం చూస్తూ చాలా జాగ్రత్తగా తన కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని డిసైడ్ అయిందట.  తాజాగా  పాయల్ తన రెండో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం.  భాను శంకర్ దర్శకుడిగా తెరకెక్కనున్న ఈ సినిమా ఈనెలలోనే సెట్స్ పైకి వెళ్తుందట. ‘RX 100’ లో తన పాత్రకు పూర్తిగా భిన్నంగా ఉండే పాత్రలో ఈ సారి పాయల్ కనిపిస్తుందని అంటున్నారు. 

Also Read:—-మరోసారి సి.ఎం గా రానా!!!!!!!

payal rajput 3

ఈ సినిమాలో పాయల్ కు యాక్షన్ సీక్వెన్స్ లు కూడా ఉన్నాయట. ఇక పాయల్ రెండో సినిమా సంగతులు ఇలా ఉంటే. ఇక పాయల్ తన 3 వ సినిమాని  స్టార్ ప్రొడ్యూసర్ C. కళ్యాణ్ నిర్మించబోయే తాజా సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చాడు అని సమాచారం.ఇక ఈ సినిమాలు హిట్ ఐతే స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెలిపొతుంది.

Also Read:——-జపాన్ లో రచ్చ చేస్తున్న రామ్ చరణ్