శైలజ రెడ్డి అల్లుడు మూవీ ఆగిపోయింది అందుకేనంట…!

శైలజ రెడ్డి అల్లుడు మూవీ ఆగిపోయింది అందుకేనంట…!
అక్కినేని యువ సామ్రాట్ నాగ చైతన్య హీరో గా మారుతి దర్శకత్యం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం శైలజ రెడ్డి అల్లుడు. ఆగస్టు 31న విడుదల కానున్న ఈ సినిమా ఎస్.రాధాకృష్ణ (చిన్నబాబు) సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై సూర్యదేవర నాగ వంశీ, పీడీవీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మారుతీ దర్శకత్యం లో తెరకెక్కిన బలే బలే మగాడివోయ్ సంగీతాన్ని ఇచ్చిన గోపి సుందర్ ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు.

Sailajareddyalludu_Trendingandhra

అయితే ఈ సినిమా ఆగస్టు 31న విడుదల కావటం లేదంట. దానికి కారణం కేరళ వరదలే అంట. అవునండి ఇది నిజమే, ఈ సినిమా షూటింగ్ పూర్తీ చేసుకున్నప్పటికీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా పెండింగ్ ఉందంట. ఈ సినిమాకి ప్రముఖ మలయాళ సంగీత దర్శకుడు గోపి సుందర్ సంగీతాన్ని ఇస్తున్న సంగతి మనకు తెలిసేందే. ఈయన సంగీతాన్ని కొచ్చిన్ లోని తన సొంత స్టూడియో లోనే చేస్తాడంట. ఇప్పుడు కేరళలోని బారి వరదల కారణంగా ఈ సినిమా నేపధ్య సంగీతం పెండింగ్ పడిందని తాజా సమాచారం.

SailajaReddyAlludu_TrendingAndhra

వాయిదాపడిన ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది మళ్లీ తెలియజేస్తామని ప్రకటించాడు నాగచైతన్య. బహుశా సెప్టెంబర్ మొదటి వారంలోనే విడుదల ఉంటుంది కాకపోతే ఒకసారి డిస్కస్ చేసుకొని ఎప్పుడో తెలియ చేస్తామని చెప్పాడు నాగ చైతన్య. ఈ సినిమాలో శైలజారెడ్డి గా రమ్యకృష్ణ నటిస్తుండగా ఆమె కూతురు గా అను ఇమాన్యుఎల్ నటిస్తోంది.