నేను పెళ్లి అయినా ఆ పని చేస్తా

ఇప్పుడు సినిమాలు జనాల్లోకి వెళ్ళాలి అంటే లిప్ లాక్ లు ప్రధానం. లిప్ లాక్ ఉంటె ఇక ఆ సినిమా కమర్షియల్ గా హిట్ అనే అభిప్రాయంలోకి దర్శక నిర్మాతలు వచ్చేసి కథలో ఆ సీన్లు ఉండేలా కథను సిద్దం చేస్తున్నారు కూడా.. ముఖ్యంగా బాలివుడ్ హాలివుడ్ లోనే ఉండే ఈ ధోరణి ఇప్పుడు తెలుగు సినిమాకు కూడా పాకింది. దీనితో తెలుగు అభిమానులు కూడా ఆ సినిమాలపై ఆశక్తిని చూపిస్తున్న సంగతి తెలిసిందే.

గతేడాది వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ఇదే తరహాలో విజయం సాధించింది కూడా..అయితే పెళ్ళైన హీరోయిన్లు మాత్ర౦ లిప్ లాక్ సీన్లలో నటించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంత మంది సినిమాలనే వదులుకుంటారు. కానని నేను అలా కాదు అది నా వృత్తిలో భాగమే అని చెప్తుంది అక్కినేని వారి కోడలు సమంతా…ఇటీవల ఒక ఇంటర్వ్యులో మాట్లాడుతూ ఇదే విషయం చెప్పింది.

`సీన్ డిమాండ్ చేస్తే లిప్‌కిస్ సీన్లు చేయ‌డానికి నాకేం అభ్యంత‌రం లేదు. ఇవ‌న్నీ నా ప్రొఫెష‌న్‌లో భాగ‌మే. పెళ్లైన హీరోలు ఇలాంటి సీన్ల‌లో ఎలా న‌టిస్తారో, మేమూ అంతే. పెళ్లైన హీరోయిన్ల ప‌ట్ల ఫిల్మ్ మేక‌ర్స్ దృక్ప‌థం మారాలి. ప్రేక్ష‌కులు పాత్ర‌తో క‌నెక్ట్ అయితే ఇంకేమీ ఆలోచించ‌రు. సినిమా వాళ్లు మాత్ర‌మే అలా ఆలోచిస్తార‌`ని చెప్పుకొచ్చింది. కాగా ఇటీవల ఈమె నటించిన రంగస్థలం సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంతా నటనకు మంచి మార్కులే పడ్డాయి.