రోజు రోజు కి వివాదాస్పదం అవుతున్న మురుగుదాస్ సర్కార్ సినిమా …

sarkar movie controversy latest updates,trendingandhra

తన ప్రతి సినిమా  ద్వారా సమాజాన్ని ఆలోచించే విధంగా యువతని మేలుకొలిపే కథ కథనం కళ్ళకు కట్టినట్టు వాస్తవికతను చూపించడం  లో దిట్ట …  వాస్తవికతను చూపించడం లో  ఎప్పటికప్పుడు ముందుండే దర్శకుడు మురుగుదాస్ ఐతే ఆయన ఏ సినిమా తీసిన అది ఒక సంచలనం సృష్టించక మానదు.  మెగా స్టార్ చిరంజీవి నటించిన    తెలుగు బ్లాక్ బస్టర్ ఠాగూర్ ఒరిజినల్ తమిళ్ సినిమా రమణ కూడా ఆయన దరకత్వం లో వచ్చినదే

సినిమా లు వేరు రాజకీయాలు వేరు అని అందరికి తెలుసు ఐనా రాజకీయాలను శాసించిన వారిలో ఎంతో మంది మహా మహులు గొప్ప గొప్ప నాయకులు కూడా సినిమా ల నుంచి వచ్చినవారే అందులోనూ ఇపుడు పొలిటికల్ నుంచి సమస్యలు ఎదురుకుంటున్న మురుగుదాస్ తమిళ రాజకీయ నాయకులనుంచి వేధింపులు కేసులు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే కొన్ని రోజుల కింద రిలీస్ ఐ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న సర్కార్ విషయం లోను ఇదే జరిగింది 

మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కార్’ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. రికార్డు స్థాయిలో ఈ సినిమా 250 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా .. కొన్ని సన్నివేశాల కారణంగా వివాదాస్పదమైంది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రతిష్ఠను దిగజార్చేలా .. ప్రభుత్వ పథకాలను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు వున్నాయంటూ ప్రభుత్తంలోని కొంతమంది పెద్దలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దాంతో మురుగదాస్ కొన్ని సన్నివేశాలను తొలగించాడు.

అయితే అంతటితో ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు శాంతించలేదనేది తాజా సమాచారం. జరిగినదానికి మురుగదాస్ బహిరంగ క్షమాపణ చెప్పవలసిందేననీ, ఇకపై ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ సినిమాలు తీయనని హామీ పత్రం రాసి ఇవ్వాలని పట్టుబడుతున్నారట. ఈ విషయంపై స్పందించిన మురుగదాస్ లాయర్, ఆయనతో చర్చించిన తరువాత ఒక నిర్ణయానికి వస్తామని తెలిపారు.   ఇక పోను పోను ఈ గొడవ ఎంత దూరం వెళుతోందో వేచి చూడక తప్పదు ఇక్కడితో ఆగితే మటుకు మురుగుదాస్ ఫాన్స్ కి హ్యాపీ అని చెప్పుకోవచ్చు …