సర్కార్ రివ్యూ వచ్చేసింది ……

sarkar movie review in telugu,sarkar movie review 2018,sarkar movie review,actor vijay sarkar movie,trendingandhra

త‌మిళ స్టార్ హీరో విజ‌య్- సెన్షేష‌న్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం స‌ర్కార్. పేరుతోనే సినీ అభిమానుల్లో వైబ్రేష‌న్స్ క్రియేట్ చేసిన ఈ చిత్రం దీపావ‌ళి కానుక‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొలిటిక‌ల్ బ్యాగ్రౌండ్‌తో తెర‌కెక్కిన ఈ చిత్ర ట్రైల‌ర్ ఇటీవ‌ల విడుద‌ల అయ్యి సంచ‌ల‌నం రేపిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ చిత్రం పై భారీగా అంచ‌నాలు పెర‌గ్గా, ప్రీరిలీజ్ బిజినెస్ కూడా అదిర‌పోయే రేంజ్‌లో జ‌రిగింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు తెలిపాయి.

దీంతో దీపావ‌ళికి బాక్సాఫీస్ వ‌ద్ద‌ స‌ర్కార్ ధ‌మాకా ఖాయ‌మ‌ని సినీ విశ్లేష‌కులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ నేప‌ధ్యంలో స‌ర్కార్ మూవీకి అప్పుడే రివ్యూ కూడా వ‌చ్చేసింది. మ‌న‌కి విదేశీ సినీ విమ‌ర్శ‌కుడు ఒక‌రు ఉన్నారుగా.. ఆయ‌నే ఉమైర్ సందు.. ఈ ఫిల్మ్‌క్రిటిక్ సెన్సార్ బోర్డు మెంబ‌ర్ కూడా.. దీంతో స‌ర్కార్ మూవీని సెన్సార్ స‌మ‌యంలో చూసి విడుద‌ల‌కు రెండు రోజులు ముందు స‌ర్కార్ మూవీకి రివ్యూ-రేటింగ్ ఇచ్చేశాడు. రివ్యూ మూడు ముక్క‌ల్లో చెప్పాలంటే.. విజ‌య్ మాసీవ్ ప‌ర్ఫామ‌న్స్, మురుగ‌దాస్ స్టైలిష్ మేకింగ్, ఏఆర్ రెహ‌మాన్ బ్యాగ్రౌండ్, ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్, అండ్ గ్రాండ్ విజువ‌ల్స్, అన్ని స‌మపాళ్ళ‌లో కుదిరాయ‌ని, దీంతో స‌ర్కార్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాయ‌మ‌ని రివ్యూ ఇచ్చాడు ఉమైర్ సందు.

అంతేకాకుండా స‌ర్కార్ చిత్రానికి 4/5 రేటింగ్ ఇచ్చాడు ఈ క్రిటిక్. దీంతో విజ‌య్ అభిమానులు తెగ ఖంగారు ప‌డిపోతున్నారు. అదేంటి రేటింగ్ 4 ఇస్తే ఆనంద‌ప‌డాలిక‌దా అంటారా దానికీ రీజ‌న్ ఉంది.. ఇటీవ‌ల్ ఉమైర్ సందు ఎక్కువ రేటింగ్ ఇచ్చి భ‌జ‌న చేసిన చిత్రాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్లు అయ్యాయి. దీంతో స‌ర్కార్ పై భారీ అంచనాలు పెట్టుకున్న వారు ఆందోళ‌ణ చెందుతున్నారు.

#SarkarMovieReviewInTelugu #SarkarMovieReview2018 #SarkarMovieReview