పుట్టినరోజు కానుకగా…..షేడ్స్ ఆఫ్ సాహో రిలీజ్ …!

sahoo teaser , sahoo ,trendingandhra

బాహుబలి సినిమాతో ఒక్కసారిగా నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ,ప్రస్తుతం ‘సాహో’ చిత్ర షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై సుజీత్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది . ఈ భారీ బడ్జెట్ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో కూడా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

SAHOO,trendingandhra

ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉండేలా డిజైన్ చేస్తున్నారు చిత్ర యూనిట్ . దీనికోసం ప్రత్యేకంగా హాలీవుడ్ నిపుణులను రంగంలోకి దింపారు నిర్మాతలు . 20 నిమిషాల పాటు సాగే ఓ భారీ యాక్షన్ ఛేజింగ్ సీన్‌ ఈ సాహూ సినిమాకే హైలైట్‌గా నిలవనుంది.

prabhas ,trendingandhra

నేడు ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సాహో’ టీం ప్రభాస్‌కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది . చిత్ర షూటింగ్‌కి సంబంధించిన కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్‌ను ‘షేడ్స్ ఆఫ్ సాహో.. చాప్టర్ 1’ పేరుతో చిత్రబృందం కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది. అబుదాబి షెడ్యూల్‌కి సంబంధించి కెన్నీ బేట్స్ కొరియోగ్రఫీలో తెరకెక్కిన యాక్షన్ సన్నివేశాలను ఈ వీడియోలో చూపించారు. ఈ వీడియోకు థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారని చిత్రబృందం చెప్పారు . సినిమాకు మాత్రం శంకర్ ఈశన్ లాయ్ సంగీతం అందించారు. జాకీషాఫ్ర్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. చివర్లో ఒక షాప్ డోర్ ఓపెన్ చేసుకొని ప్రభాస్ నడిచి వస్తున్నట్టు చూపించారు. ఈ సాహూ లో ప్రభాస్ లుక్ అదరహో అనేలా ఉంది .

 

#ShadesofSahooChapter1Released #Sahoo #Prabhas