షారూక్ 53వ బర్త్‌డే……అభిమానుల కోలాహాలం …!

ShahrukhKhan,bollywood latest news,latest bollywood news, Shahrukh's 53rd Birthday ...... Fans' Celebrations ...!,trendingandhra

బాలీవుడ్ బాద్‌షా సూపర్‌స్టార్ షారూక్ ఖాన్ 53వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన బర్త్‌డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపేందుకు మన్నత్‌లోని ఆయన నివాసానికి అభిమానులు శుక్రవారంనాడు పెద్దఎత్తున చేరుకున్నారు. కొందరు వీరాభిమానులు అర్ధరాత్రి నుంచే షారూక్‌కు అభినందనలు తెలిపేందుకు వేచిచూశారు. దీంతో షారూక్ తన నివాసం నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదాలు తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన అభిమానులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు సైతం షారూక్ నివాసం వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు.

కాగా, షారూక్ అభిమానులు ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూస్తున్న ఆయన తాజా చిత్రం ‘జీరో’ ట్రైలర్‌ ఇవాళే విడుదల కానుంది. చిత్ర నిర్మాతలు ఇందుకోసం గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ట్రైలర్ లాంచింగ్ కార్యక్రమంలో షారూక్, చిత్ర కథానాయికలు అనుష్కా శర్మ, కత్రినా కైఫ్ తదితరులు హాజరుకానున్నారు. ఇందులో మరుగుజ్జు పాత్రలో చేస్తున్న షారూక్…ఒక సూపర్‌స్టార్‌తో ప్రేమలో పడతాడు. లవర్ పాత్రను కత్రినాకైఫ్ పోషిస్తున్నారు. అనుష్క మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో చిత్రం రూపొందింది. డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు

#ShahrukhKhan #LatestBollywoodNews