శైలజారెడ్డి అల్లుడు 11 రోజుల కలెక్షన్స్ …..!

shailaja reddy alludu movie , trendingandhra

అక్కినేని నాగచైతన్య హీరోగా, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం శైలజారెడ్డి అల్లుడు. ఈ చిత్రానికి రివ్యూస్ అంత గొప్పగా రాలేదు కానీ వసూళ్లు మాత్రం బాగానే వచ్చాయి . సెప్టెంబర్ 13న విడుదలైన శైలజారెడ్డి అల్లుడు చిత్రం మొత్తంగా 11 రోజుల్లో 17. 65 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా సాధించింది .

shailaja reddy alludu , shailaja reddy alludu movie , trendingandhra

అసలు రివ్యూస్ తో పోల్చితే ఈ వసూళ్లు బ్రహ్మాండం అనే చెప్పాలి . లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి మారుతి దర్శకత్వం వహించాడు . నాగచైతన్య సరసన అను ఇమ్మాన్యుయేల్ నటించగా కీలక పాత్రలో అత్తగా రమ్యకృష్ణ నటించింది . నరేష్ , 30 ఇయర్స్ పృథ్వీ , మురళీశర్మ తదితరులు నటించారు .

shailaja-reddy-alludu , trendingandhra

ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందించాడు . ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 18 కోట్ల వసూళ్లని సాధించడంతో ఇక బ్రేక్ ఈవెన్ కావాలంటే , బయ్యర్లు లాభాల్లోకి రావాలంటే మరో ఆరు కోట్లు వసూల్ చేయాలి . మరి ఆ వసూళ్లు శైలజారెడ్డి అల్లుడు సాదిస్తాడో లేదో చూడాలి …..