అర్జున్ రెడ్డి భామతో నిఖిల్…!

నిఖిల్ తెలుగు తెరకు పరిచయమైనప్పటి నుంచి తనదైన నటన వైవిధ్యమైన కథలతో అందరిని అక్కటుకుంటున్న విషయం తెలిసిందే.ఇటీవల కొత్త తరహా చిత్రాలతో విజయాలు అందుకున్నాడు.తన తదుపరి చిత్రం కిరాక్ పార్టీ టీజర్,పోస్టర్స్ అందరిని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.ఈ సినిమా తరవాత నిఖిల్ ‘కణితన్’ రీమేక్ చేయడానికి రంగంలోకి దిగనున్నాడు. ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళ వెర్షన్ ను తెరకెక్కించిన సంతోష్ తెలుగు సినిమాకి కూడా దర్శకత్వం వహించనున్నాడు.

ఈ సినిమాలో కథానాయికగా కేథరిన్,మేఘా ఆకాశ్ పేర్లు వినిపించాయి. అయితే వీరిలో ఎవరినీ ఎంపిక చేయలేదట. ఈ సినిమాలో పాత్ర పరంగాతన జోడీగా షాలినీ పాండే అయితే బాగుంటుందని నిఖిల్ భావిస్తున్నాడట. దాంతో దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారు. స్క్రిప్ట్ చూశాక ఒక నిర్ణయానికి వస్తానని ఆమె చెప్పడంతో, స్క్రిప్ట్ ను అందజేశారు. కథ తన పాత్ర తీరుతెన్నులు ఆమెకి నచ్చాయనీ, త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.