శివరాత్రి నాడు ఈ శక్తివంతమైన మంత్రాలను ఉచ్ఛరిస్తే…!

మంత్రం అంటే పరివర్తనం కలిగించేది.. మంత్రోచ్చారణ వల్ల వ్యక్తిలో ఆధ్యాత్మిక శక్తి ఏర్పడుతుంది. క్రమమైన పద్ధతిలో మంత్రోచ్చారణ వల్ల శరీరంలో ప్రకంపనలు ఏర్పడతాయి. ఈ ప్రకపంనలు విశ్వంలోకి చేరి మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ఓం నమ:శివాయ ఇది పంచాక్షరీ మంత్రం. శివ అంటే మంగళకరం అని అర్థం. శివ పంచాక్షరీ మంత్రాలు అత్యంత శక్తివంతమైనవి. నిర్మలమైన మనసుతో వీటిని ఉచ్చరిస్తే మంచి ఫలితాలు వస్తాయి. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయం సాధిస్తారు. శివ మంత్రోచ్చరణ ద్వారా తమకు కలిగిన అనుభూతిని మునులు, రుషి పుంగవులు పురాణాల్లో తెలియజేశారు. వాటిలో కొన్ని విశిష్టమైనవి ఏకాదశ రుద్ర మంత్రాలు. ఏకాదశ రుద్ర మంత్రాలను ప్రత్యేకంగా శివరాత్రి రోజున జపిస్తే మహారుద్ర యాగం చేసిన ఫలితం దక్కుతుంది.

కపాలీ- ఓం హుమ్ హుమ్ శత్రుస్థంభనాయ హుమ్ ఓం ఫట్

పింగళ- ఓం శ్రీం హ్రీం శ్రైం సర్వ మంగళాయ పింగళాయ ఓం నమ:

భీమ- ఓం ఐం ఐం మనో వాంఛిత సిద్ధయే ఐం ఐం ఓం

విరూపాక్ష- ఓం రుద్రాయ రోగనాశాయ అగచ చ రామ్ ఓం నమ:

విలోహిత- ఓం శ్రీం హ్రీం సం సం హ్రీం శ్రైం సంకర్షణాయ ఓం

శశస్త- ఓం హ్రీం సాఫల్యాయి సిద్ధయే ఓం నమ:

అజపాద- ఓం శ్రీం బం సో బలవర్ధనాయ బలేశ్వరాయ రుద్రాయ ఫత్ ఓం

అహిర్బుధన్య- ఓం హ్రైం హ్రీం హుమ్ సమస్త గ్రహదోష వినాశయ ఓం

శంబు- ఓం గం గ్లామ్ శ్రౌం గ్లామ్ గమ ఓం నమ:

చంద- ఓం చుమ్ చండేశ్వరాయ తేజశ్యాయ చుమ్ ఓం ఫట్

భవ- ఓం భవోద్భవ శంభవాయ ఇష్ట దర్శన హేతవే ఓం సం ఓం నమ: