కీలక నేత రాజీనామా తో బీజేపీ కి షాక్

Shock to the BJP with the resignation of the key leader,telangana politics news,latest telangana political news.trendingandhra

తెలంగాణా ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో బీజేపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మరో కీలకనేత రాజీనామా చేస్తున్నారు. పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలకు అసహనం వ్యక్తం చేస్తున్న బీజేపీ ఎక్స్‌ సర్వీస్‌ మెన్‌ సెల్‌ రాష్ట్ర కో కన్వీనర్‌ గోపు రమణారెడ్డి పార్టీని వీడుతున్నట్లు స్వయంగా మీడియాకి తెలిపారు. అసలే నాయకులు లేక కొన్ని స్థానాల్లో వేరే పార్టీ నాయకులకు టికెట్ ఇస్తామని మరీ పిలుపునిస్తున్న పార్టీ ఉన్న నాయకులకు అవకాశం ఇవ్వక ఇబ్బంది పెడితే పార్టీ మారే ఆలోచన చేస్తున్నారు.
రానున్న ఎన్నికల్లో బీజేపీ నుండి మల్కాజిగిరి టికెట్‌ ఆశించానని, టికెట్‌ రాకపోవడంతో చాలా అసంతృప్తికి గురయ్యానని చెప్తున్నారు గోపు రమణారెడ్డి. వీలైతే రెబల్‌గా, లేదా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే, నోటీసు ఇచ్చి వివరణ అడగాల్సి ఉంటుందని, వివరణకు సంతృప్తి చెందకపోతే సస్పెండ్‌ చేసే అధికారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఉంటుందన్నారు. అయితే అలా కాకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం సమంజసం కాదని గోపు రమణారెడ్డి పేర్కొన్నారు.
జిల్లా పార్టీ ఆదేశాల మేరకు నియోకవర్గ నాయకులు సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించడాన్ని ఖండిస్తున్నాని చెప్పారు. తన ఎదుగుదలను ఓర్వలేక కొందరు దుష్పచారం చేస్తున్నారని వారికి తగిన బుద్ధి చెప్తానన్న ఆయన పార్టీ కోసం ఇంతకాలం పని చేస్తే పార్టీ పెద్దలు పట్టించుకోకపోవడంతో మనస్తాపం చెంది, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

#ShockToTheBJPWithTheResignationOfTheKeyLeader #LatestTelanganaPoliticalNews #TelanganaPoliticsNews #telanganaBjpNews #NarendraModi