టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత …!

siva prasad reddy passes away , trendingandhra

ప్రముఖ నిర్మాత డి శివప్రసాద్ రెడ్డి (62) ఈ రోజు ఉదయం 6.30 ని.లకి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నమూశారు. కొన్నాళ్లుగా ఆయన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. అయన కి ఇటీవలే గుండె సంబంధిత సమస్య తో సర్జరీ కూడా జరిగింది .

siva prasad , trendingandhra

1985లో కామాక్షి మూవీస్ అనే బేనర్ స్థాపించి పలు హిట్ సినిమాలు నిర్మించారు. కార్తీక పౌర్ణమి, శ్రావణ సంధ్య ,విక్కీ దాదా, ముఠా మేస్త్రి, అల్లరి అల్లుడు, ఆటో డ్రైవర్, సీతారామరాజు, ఎదురు లేని మనిషి, నేనున్నాను, బాస్ , కింగ్‌, కేడి, రగడ, దడ, గ్రీకు వీరుడు అనే చిత్రాలు ఆయన బేనర్‌లో నిర్మితమయ్యాయి.

producer siva prasad, trendingandhra

అక్కినేని నాగార్జున హీరోగా ఎక్కువ సినిమాలు నిర్మించారు శివప్రసాద్ రెడ్డి. ఆయన నిర్మాతగానే కాక పలు చిత్రాలని డిస్ట్రిబ్యూట్ కూడా చేశారు. నాగార్జునతో రూపొందించిన గ్రీకు వీరుడు ఆయన చివరి చిత్రం. శివ ప్రసాద్ మృతికి సంతాపంగా ఇటు తెలుగు, అటు తమిళ పరిశ్రమకి సంబంధించిన పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

#shockToTollywoodProducerSivaPrasadIsPassesAway #Tollywood #SivaPrasadReddy