సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్ …!

చంద్రబాబు నాయుడు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని వైసీసీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు.ప్రజా సంకల్ప యాత్రంలో భాగంగా మంగళవారం నెల్లూరు జిల్లా, కనిగిరిలో బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు రేషన్‌ షాపుల్లో బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదని అన్నారు. ఆ బియ్యం కూడా కుటుంబంలో ఐదారుగురు ఉంటే అందులో ఒకరిద్దరి వేలు ముద్రలు పడడంలేదని రేషన్ కత్తిరిస్తున్నారని ఆయన విమర్శించారు.ఏపీలో పెట్రోల్‌ ధరలు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. మార్చి 5 నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో మా పార్టీ ఎంపీ లు హోదా కోసం పోరాడుతారని చెప్పారు.ఏప్రిల్ 6 లోపు ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇవ్వకపోతే మా ఎంపీ లు రాజీనామా చేస్తారు అని ప్రకటించారు.ఇంతకుముందు చెప్పిన కూడా ఈ సరి జగన్ రాజీనామా చ్చేస్తారు అని చెప్పడం సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోజా, జిల్లా నాయకులు పాల్గొన్నారు.