ఛీ 100 ఏళ్ళ వృద్దురాలిపై అత్యాచారం

woman raped , rape attempt , trendingandhra

మానవత్వం మంటగలిసి పోతుందని ఎవరో అన్న మాటలను అక్షరాల నిజం చేస్తున్నారు కొందరు. ఇప్పటి వరకు 70 ఏళ్ళ వృద్దుల వరకు అత్యాచార ఘటనలు చూసిన ప్రపంచం తాజాగా 100 ఏళ్ళ వృద్దురాలిపై అత్యాచార ఘటనను చూసింది. మనుషులు తలదించుకునే ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది.

rape,trendingandhra

వివరాల్లోకి వెళితే కోల్‌కతాకు 65 కిలోమీటర్ల దూరంలోని గంగాప్రసాద్‌పూర్‌ గ్రామంలో, సోమవారం రాత్రి వృద్ధురాలు నిద్రిస్తున్న సమయంలో అభిజిత్‌ బిశ్వాస్‌ అనే 21 ఏళ్ల యువకుడు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు.తర్వాత ఆమె వేసిన కేకలకు కుటుంబ సభ్యులు వచ్చి యువకుణ్ని దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. బాధితురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వృద్ధురాలిని వైద్య పరీక్షల నిమిత్తం మంగళవారం ఆస్పత్రికి తరలించారు. ఆ యువకుడిని కోర్టులో హాజరు పరిచారు.

#100YearsWomanRapedbyYoungMan #Kolkata #WestBengal