షాకింగ్ .. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై మోడీ వేటు వెనుక పెద్ద కుట్రే

alok varma trendingandhra

ప్రధాని మోడీ అలోక్ వర్మపై వేటు వెయ్యటానికి కారణం ఏంటి? మోడీ సన్నిహితుడు రాకేశ్ అస్తానా పై అవినీతి కేసు నమోదు చేసినందుకే ఇది జరిగిందా? లేదా వేరే ఏదైనా పెద్ద కారణమే ఉందా ? సీబీఐ పరువు పోతున్న అంశంలో మోడీ పాత్రా ఏమైనా ఉందా ? అసలేం జరుగుతుంది. అంటే ఆసక్తికర అంశాలు తెరమీదకు వస్తున్నాయి. వేల కోట్ల రూపాయల రాఫెల్‌ యుద్ధ విమానాల కుంభకోణంపై ప్రాథమిక దర్యాప్తునకు వర్మ సిద్ధం కావడంతోనే మోదీ ఆయనను తప్పించారనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ కు చెందిన మాజీ కేంద్ర మంత్రులు యశ్వంత్‌ సిన్హా, అరుణ్‌ శౌరీ, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌లు ఇటీవల రాఫెల్‌ కుంభకోణంపై సీబీఐకి ఫిర్యాదు చేశారు. అయితే ఆ ఫిర్యాదును సీబీఐ స్వీకరించింది. అంతే కాకుండా వారు చెప్తున్నా విషయాలను చాలా శ్రద్ధగా వింది. ‘‘యూపీఏ ప్రభుత్వ హయాంలో ఫ్రాన్స్‌ నుంచి 126 రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు నిర్ణయం జరిగిందని ఇందులో 18 విమానాలను ఫ్రాన్స్‌లోని దసో సంస్థ నేరుగా సరఫరా చేయాల్సి ఉండగా, మరో 108 విమానాలను సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ద్వారా భారత్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌)లో తయారు చేయాల్సి ఉంది. అయితే ఒప్పందం కుదురుతున్న దశలో మోదీ ఏకపక్షంగా దానిని రద్దు చేశారు. 36 విమానాలను ఫ్రాన్స్‌ నుంచి నేరుగా కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు చట్టపరంగా అవసరమైన ప్రక్రియలేవీ ఆయన పాటించలేదు’’ అని వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాఫెల్‌ ఒప్పందానికి సంబంధించిన అనేక పత్రాలను కూడా వారు సీబీఐకి అందజేశారు. అసలు వారికి అపాయింట్మెంట్ ఇవ్వటమే మోడీ ప్రభుత్వానికి నచ్చలేదు. ఇక అలోక్ వర్మ వారు అందజేసిన పత్రాలు నిజమైనవా, కావా ధ్రువీకరించాల్సిందిగా రక్షణ శాఖను కోరారు. ముగ్గురు ప్రముఖులు సమర్పించిన ఆ పత్రాలు నిజమైనవేనని రక్షణ శాఖ ధ్రువీకరిస్తే రాఫెల్‌ కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ప్రాతిపదిక లభిస్తుందని భావించారు అలోక్ వర్మ . నిబంధనలు పాటించే అధికారిగా అలోక్‌ వర్మ ముగ్గురు ప్రముఖుల ఫిర్యాదును స్వీకరించారు.

తమ రాజకీయ ప్రయోజనాలకు ఏరికోరి తెచ్చుకున్న అధికారి అలోక్‌ వర్మ తమ ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తున్నాడనుకుని మోదీ ఆగ్రహం చెందడం వల్లే ఆయనపై వేటు వేసినట్లు కనిపిస్తోందని టాక్. అలోక్‌ వర్మ, అస్థానా… ఇద్దరు అధికారులూ పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడాన్ని సాకుగా చూపి మోదీ సర్కారు ఇద్దరినీ సెలవుపై పంపి విచారణకు ఆదేశించింది. అది తేలేవరకు ఇద్దరూ సెలవులోనే ఉంటారు. ఇందులో చాలా పెద్ద ప్లాన్ వుంది. విచారణ ముగిసి అలోక్‌ వర్మ నిర్దోషిగా తేలే లోపు ఆయన రెండేళ్ల పదవీకాలం ముగిసిపోతుంది. ఎన్నికలు పూర్తయ్యే వరకూ సీబీఐలో రాఫెల్‌ కేసును కదలించే వారు ఉండరు. కాబట్టి తమ ప్రభుత్వం పై జరుగుతున్నా రాఫెల్ దాడికి చెక్ పడుతుంది అని భావించారు మోడీ. రాఫెల్‌ విమానాలను తయారు చేసే సామర్థ్యం ప్రభుత్వ రంగ సంస్థ అయిన హాల్‌కు లేదని సాక్షాత్తూ రక్షణమంత్రి చెప్పడం హాల్‌ వర్గాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. అస్మదీయుడికి రాఫెల్ యుద్ధ విమానాల తయారీ బాధ్యతను అప్పజెప్పిన మోడీ ఈ పరిస్థితుల్లో రాఫెల్‌ కుంభకోణం మీద దర్యాప్తు జరిగితే తమ బండారం ఎక్కడ బయటపడుతుందోననే భయం వల్లే అలోక్ వర్మపై వేటు వేసినట్టు తెలుస్తుంది.

#ShockingNewsModiConspiracyBehindRemovalofCBIDirectorAlokVerma #AlokVerma #RakeshAsthana