టీఆర్ఎస్‌, బీజేపీల‌కు షాకింగ్ న్యూస్‌..!

TRS ,BJP ,TrendingAndhra

భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఇది కొంత షాకిచ్చే వార్తే. అలాగే, టీఆర్ఎస్‌కు కూడా ఇది నిరుత్సాహ ప‌రిచే సంఘ‌ట‌నే. కానీ, ప్ర‌ధానంగా ఎక్కువ భారీ షాక్ భార‌తీయ జ‌న‌తా పార్టీకే. ఎందుకంటే, డిసెంబ‌ర్‌లో రాజ‌స్థాన్‌, మ‌ధ్య ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌ఘ‌డ్‌, మిజోరాం ఎన్నిక‌లు జ‌ర‌గాలి. వాటికంటే ముందే తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రిపించి అక్కడ కాంగ్రెస్ ఓడిపోతే మ‌ధ్య ప్ర‌దేశ్, రాజ‌స్థాన్, ఛత్తీస్‌ఘ‌డ్ లపై ఆ ప్ర‌భావం ఉంటుంద‌ని బీజేపీ భావించింది.

ఆ మూడు రాష్ట్రాల్లో ఓట‌మి ఖాయంగా క‌నిపిస్తుండ‌టంతో భార‌తీయ జ‌న‌తా పార్టీకి ఇప్పుడు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. మ‌రి మొత్తంగా నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల‌తోనే తెలంగాణ‌లో కూడా ఎన్నిక‌లు జ‌ర‌ప‌నున్నారా..? అక్టోబ‌ర్ 8న ఎన్నిక‌ల షెడ్యూల్ కూడా రాబోతుందా….?
మొత్తం బీజేపీ వ్యూహం ఇప్పుడు బెడిసి కొడుతుందా..? ఆ నాలుగు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కంటే ముందే.. తెలంగాణ‌లో ఎన్నిక‌లు సాధ్యం కావా..?

అయితే, తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రిగే ప‌రిస్థితుల‌ను నిశితంగా ప‌రిశీలించేందుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం స‌భ్యులు మ‌రో మారు హైద‌రాబాద్‌కు రానున్న‌ట్టు స‌మాచారం. అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్‌ల ద్వారా రోజుకు స‌గ‌టున ఎన్ని ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయో… మొత్తంగా ఎలాంటి అభ్యంత‌రాల‌ను వ్య‌క్తం చేస్తున్నారో అన్న అంశాలపై ఇప్ప‌ట‌కే సీవో కార్యాల‌యం ఏరోజుకారోజు ప‌ర్య‌వేక్షిస్తూ ఉంది.