జగన్ పై దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్

jagan , jagan attack , trendingandhra

వైసీపీ అధినేత జగన్ పై జరిగిన దాడి కేసు కీలక మలుపులు తిరుగుతుంది. జగన్ పై కత్తి తో అభిమాని దాడి చేసిన నేపధ్యంలో ఏపీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ నేతలు మాటల యుద్ధానికి తెరలేపారు. వైసీపీకి మద్దతుగా తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన టీఆర్ఎస్ నేతలు కూడా చంద్రబాబుపై మాటల యుద్ధానికి దిగారు. అసలు దాడి జరిగింది కేంద్ర పరిధిలో ఉన్న ఎయిర్ పోర్ట్ లో అని చెప్పినా వినకుండా ఇది టీడీపీ చేస్తున్న కుట్రగా అభివర్ణించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ నాయకులు.

jagan , trendingandhra

జగన్ పై జరిగిన దాడి నేపధ్యంలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఏపీ మారుమోగుతుంది. దాడి జరిగిన వెనతనే హైదరాబాద్ కు జగన్ వెళ్ళిపోవటం కూడా పలు అనుమానాలకు తావిస్తుంది. పోలీసులకు వివరాలు ఏమి చెప్పకుండా వెళ్ళిపోయిన జగన్ తీరును టీడీపీ తప్పు పడితే టీడీపీ నే దాడి చేయించింది కాబట్టి ఏపీ పోలీసుల మీద నమ్మకం లేక వెళిపోయాడు అని వైసీపీ నేతలు చెప్పటం అధికార పార్టీ కి ఆగ్రహం తెప్పిస్తుంది. కేంద్ర పరిధిలో జరిగిన ఘటనకు కేంద్రాన్ని ప్రశ్నించక కేవలం స్వార్ధ రాజకీయం కోసం తమ మీద దాడికి దిగుతున్నారని చెప్తున్నారు టీడీపీ నేతలు. ఏపీ లో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది.

అయితే ప్రస్తుతం జ‌గ‌న్ పై దాడి కేసు మ‌రో మ‌లుపు తిరిగింది. దాడి ఘటనపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ అనిల్ కుమార్, అమర్‌నాథ్‌రెడ్డి హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సీఎస్‌ఎఫ్ అధికారుల రిపోర్టు తీసుకోవాలని దాడి ఘటన మొత్తం సీబీఐ చేత విచారణ జ‌రిపించాల‌ని లంచ్‌మోషన్ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. పలు నాటకీయ పరిణామాల మధ్య సాగుతున్న జగన్ పై దాడి రగడ మరే రూపం తీసుకోనుందో… హైకోర్టు ఈ పిటీషన్ పై ఏమి నిర్ణయం తీసుకుంటుందో మరి.

#ShockingTwistInJaganMurderAttempt #YCP #TDP