సౌత్ ఇండియా లో టాప్ 10 గ్రాస్ సినిమాలు

south indian top 10 highest grossing movies,top 10 south indian movies of all time,top 10 south indian movies 2018,South indian top 10 movies,trendingandhra

మన చిత్ర సీమ లో ఫస్ట్ డే కలెక్షన్స్ , గ్రాస్ , షేర్ , ఫస్ట్ వీక్ అంటూ అభిమానుల తో పాటు చిత్ర యూనిట్ కి కూడా చాలా లెక్కలు ఉంటాయి. మరి ఈ లెక్కల్లో టాప్ 10 గ్రాస్ సినిమాలు ఎం ఉన్నాయో చూద్దాం.

1) బాహుబలి 2
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ చిత్రం ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలాచేసింది. రాజమౌళి దర్శకతం వహించిన ఈ చితం 211.77 కోట్ల గ్రస్స్ ను కలెక్ట్ చేసింది.

2) కబాలి
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా ఎంతో ఎక్సపెక్టషన్స్ తో ఎన్నడు లేని విధంగా ఇండియా మలేషియా కూడా భారీ ఎత్తున్న రిలీజ్ అయిన సినిమా కబాలి. పా . రంజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా బాగా నిరాశపరిచింది. కానీ మొదటి రోజు ఈ సినిమా 88.03 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి ఎప్పటికి రెండవ స్థానం లో నిలిచింది.

3) బాహుబలి 1
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు సినిమా రూపురేఖలనే మార్చేసింది. తెలుగు సినిమా ఊహించ లేని కౌంట్స్ ని నమోదు చేసింది. ఈ సినిమా 73.85 కోట్ల సాధించి తెలుగు సినిమా గర్వపడేలా చేసింది.

4)సర్కార్
తమిళంలో విపరీతమైన మాస్ ఫాలోయింగ్ వున్నా హీరో దళపతి విజయ్. దీపావళి కి రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి రోజు 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి నాల్గవ స్థానం లో వుంది.

5)అగ్న్యాతవాసి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా జల్సా , అత్తరింటికి దారేది తరువాత త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం అగ్న్యాతవాసి. 2018 సంక్రాంతి కి వచ్చిన ఈ చిత్రం దారుణంగా నిరాశపరిచినప్పటికీ మొదటి రోజు మాత్రం 60కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి పవర్ స్టార్ స్టామినా నిరూపించింది.

6)అరవిందసమేత వీరరాఘవ
వరస విజయాలతో జోరు మీద వున్నా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సామెత తో క్రియేట్ చేసిన రికార్డ్ ల కోసం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రం ఎన్టీఆర్ కెర్రిర్ లో నే మొదటి రోజు 58 కోట్ల అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

7) భారత్ అనే నేను
స్పైడర్ వంటి డిసాస్టర్ తరువాత సూపర్ స్టార్ మహేష్ , తనకు హిట్ ఇచ్చినా కొరటాల శివ తో చేసిన చిత్రం భారత్ అనే నేను. ఈ చిత్రం ప్రపంచం వ్యాప్తంగా 55 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

8) ఖైదీ 150
మెగా స్టార్ చిరంజీవి కం బ్యాక్ చిత్రం ఖైదీ ౧౫౦. చిరంజీవి 150 చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వినాయక్ డైరెక్ట్ చేసాడు. మురగదాస్ డైరెక్ట్ చేసిన తమిళ కత్తి కి ఈ సినిమా రీమేక్. ఈ సినిమా 50.98 కోట్లు కలెక్ట్ చేసింది.

9) జై లవకుశ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో బాబీ తెరకెక్కించిన చిత్రం జై లవకుశ. ఈ చిత్రం లో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసాడు. ఎన్టీఆర్ నటన ఈ చితం లో అద్భుతం గా చేసాడు. ఈ సినిమా 48 కోట్లు కలెక్ట్ చేసింది.

10) మెర్సెల్
దళపతి విజయ్ తో తేరి తరువాత అట్లీ డైరెక్ట్ చేసిన చిత్రం మెర్సల్. తెలుగు లో ఈ చిత్రం అదిరింది గా విడుదల అయి ఎక్కడ కూడా మంచి విజయం సాధించింది.ఈ చిత్రం మొదటి రోజు 46.08 కోట్ల కలెక్ట్ చేసి పదవ స్థానం లో వుంది.

#SouthIndianTop10HighestGrossingMovies #top10SouthIndianMoviesOfAllTime #Top10SouthIndianMovies2018