దసరా లోపు ఇది చదివితే మీ దరిద్రంపోయి మీ జీవితం మారిపోతుంది…. !

devi navaratri , Trendingandhra

దేవినవరాత్రులకి మన దేశం లో చాలా గొప్పతనం ఉంది . ఈ నవరాత్రుల సమయం లో ఒక్కొక రోజు ఒక్కో రూపంలో ఆ అమ్మవారిని అలంకరించి పూజిస్తుంటారు . మొదటిరోజు అమ్మవారికి స్వర్ణ కవచ అలంకరణ రూపాన్ని చేస్తారు . ఇకపోతే ఈ రూపం కి ఉన్న విశిష్టత ని తెలిపే ఒక కథ ఉంది . ఈ రూపాన్ని ఒక్కసారి దర్శించినా , లేక కథని చదివినా వారికున్న జన్మజన్మాల పాపాలు తొలగిపోయి ఈ నవరాత్రులు ముగిసేలోపే మంచి జరుగుతుంది . మరి ఆ కథ ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం .

పూర్వకాలం లో దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు , ఒక సారి ఈ రాక్షసుడు తప్పస్సు చేస్తుండగా , బ్రహ్మ దేవుడు ప్రత్యేక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకో అని అడుగుతాడు . వేదములు అన్ని న వశం కావాలి , దేవతలని నేను జయించాలని కోరుతాడు .దానికి బ్రహ్మ దేవుడు మరో ఆలోచన లేకుండా తధాస్తు అని అనేస్తాడు .దీనితో లోకంలోని వేదాలన్నీ ఆ రాక్షసుడిలోకి ప్రవేశయిస్తాయి . ఆ తరువాత బ్రాహ్మణులు వేదాలని మరచిపోతారు ,దీనితో జరగాల్సిన యజ్ఞాలు , యాగాలు అన్ని కూడా ఆగిపోతాయి . దేవతలందులు కూడా వృద్దులుగా మారిపోయి తమ శక్తిని కోల్పోయారు .

ఈ సమయం లో దేవతలందరు కలిసి అమ్మ వారిని ఆదుకోమని ప్రార్థనలు చేస్తారు .ఆ తరువాత అమ్మ ప్రత్యేక్షమౌతుంది . మొదటగా వచ్చిన అమ్మ కి శతాక్షి అని పేరుపెట్టారు , వంటి నిండా కళ్ళతో ప్రత్యేక్షమైన అమ్మవారు , ఆ దేవతలతో మాట్లాడుతూ మిమల్ని చేసుకోవడానికే నేను ఇన్ని కళ్ళుపెట్టుకొని ఉన్నాను , మీకెందుభయం అని అడగ్గా , బతకడానికి తిండి కూడా లేదు అని చెప్తారు . అప్పుడు ఆ తల్లి వారందరికీ శాకంభరీ దేవిగా కనిపించింది . అడిగినవారందరికి లేదు అనకుండా ఇస్తుంది . దీనితో మళ్ళీ పూజలు మొదలౌతాయి . ఈ విషయం తెలుసుకున్న దుర్గముడు ఆ దేవితో 11 రోజులపాటు తలపడతాడు . ఆ దుర్గముడిని అంతమొందించి మళ్ళీ వేదాలని దేవతలకి అప్పగిస్తుంది అమ్మవారు . అందుకే నవత్రులలో మొదటి రోజు స్వర్ణ కవచ అలంకారం రూపం లో ఆ తల్లిని పూజిస్తారు . ఇదే దేవి నవరాత్రులలో మొదటి రోజు కథ .