ఓనమ్ గురించి మీకు తెలియని నిజాలు …!

ఓనమ్ గురించి మీకు తెలియని నిజాలు …!

కేరళ ప్రజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఉత్సాహభరితంగా జరుపుకొనే పండగ ఓనం. మహాబలి ఆగమనాన్ని పురస్కరించుకొని కేరళ వాసులు ఓనం పండగని సంబరాల మధ్య జరుపుకుంటారు. కేరళ ఘనమైన సంస్కృతి సంప్రదాయాలకు వారసత్వంగా ఈ పండగను పది రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ పండగ విశేషాలు తెలుసుకోవడానికి విదేశీయులు సైతం కేరళ వస్తుంటారు. ఇక్కడ నృత్యాలు, విందు భోజనాలు, పులి వేషాలు, ప్రాచీన విద్యలు – ఆటలు మరియు పడవ పందేలు కన్నుల పండగ గా జరుగుతాయి. మలయాళీయుల పంచాంగం ప్రకారం ఆగస్టు- సెప్టెంబర్ లో ఓనం వస్తుంది.

ఓనం పండగ ఎందుకు ??

Onam Festival

విష్ణుమూర్తిచే పాతాళం లో కి తోకబడిన బలిచక్రవర్తి విష్షును ఒక కోరిక కోరతాడు.విష్ణుమూర్తి ఆ కోరిక మేరకు ప్రతి ఏడాది తన ప్రజలను చూసేందుకు వచ్చేలా వరమిస్తాడు.బలిచక్రవర్తి ఓనం రోజున తన ప్రజలను కలుసుకొనేందుకు ఆత్మరూపంలో వస్తాడని కేరళవాసుల  నమ్మకం. అందుకనే అతడిని  ఇళ్ళలో ఆహ్వానించడానికే ఈ పండగను జరుపుకుంటారు.

ఓనం పండగ మొదలు .. ముగింపు

“ఆతం” పేరుతో ప్రారంభమయ్యే ఉత్సవాలు పదో రోజున “తిరు ఓనం”తో  ముగుస్తాయి.10 రోజుల పటు చాలా ఘనంగా ఈ  సంబరాలు నిర్వర్తిస్తారు.రాష్ట్రమంతటా పాటించే ఆచారములు, ఈ వ్యవసాయ పండుగకు చిహ్ననాలు.

Also read :– సెప్టెంబర్ 21 న తారామణి చిత్రం రిలీజ్.

వేశాధారణ:

Onam Festival

ఓనం రోజు మగవారు షర్ట్ లుంగీ వేసుకుంటారు.ఆడవారు లంగా వోణి వేసుకుంటారు.

కథాకళి:

onam Festival

కళలు ఎన్ని ఉన్న “కథాకళి” నృత్యానికే ప్రధానం ఇస్తారు . రామాయణ, మహాభారతాల్లోని కొన్ని ఘట్టాలను విధిగా ప్రదర్శిస్తారు. పురాణాలు, చరిత్రపై పిల్లల్లో తగిన అవగాహన కల్పించేందుకు సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో దోహద పడతాయని మలయాళీల విశ్వాసం.

 స్నేక్ బోట్ రేస్:

onam Festival

కేరళ రాష్ట్రంలో అలెప్పి బోట్ రేస్ లకి పెట్టింది పేరు.ఇక్కడ జరిగే బోట్‌ కార్నివాల్‌ . ఓనం పండగ టైమ్ లోనే జరిగే ఈ పోటీలు చూసేందుకు దేశ విదేశాల నుండి పర్యాటకులు తరలివస్తుంటారు. వందలమంది వేసే తెడ్లతో పంబానదిని వాయు వేగంతో చీల్చుకుంటూ పోతున్నట్లుగా కనిపించే పాము పడవల్ని చూసేందుకు పర్యాటకులు, అక్కడి ప్రజలు ఎనలేని ఆసక్తి ని కనబరుస్తుంటారు.

ఈ స్నేక్ బోట్ రేస్ ఎందుకు ఇంత ప్రతేకం అంటే  పాతరోజుల్లో ఆరముల పార్థసారధి దేవాలయంలో జరిగే తిరువోనసడయ( ఓనమ్ విందు)కు అవసరమైన కూరగయాలు, పప్పులు మరియు ఇతర ఆహార పదార్థాలను పాము బోట్లలో ఊరేగింపుగా తీసుకొచ్చేవారు. దానికి గుర్తు చేసేందుకు ఆరుములా వల్లంకలిని నిర్వహిస్తూ ఉంటారు. 

Also Read:–   చివరికి వాటిని కూడా వదలలేదు..

త్రిక్కకర అప్పన్  పూజలు:

onam Festival

 

ఓనం పండగ రోజులలో కేరళలోని త్రిక్కకరలో గల వామనమూర్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తమ తమ ఇళ్ల లో త్రిక్కకర అప్పన్‌ (వామనుడు) విగ్రహాలను ప్రతిష్టించి పూజిస్తారు.

విందు భోజనాలు:

Onam Festival

ఓనం పండగ లో చివరి రోజున ‘తిరు ఓనం’ సందర్భంగా పచ్చని ఆకులో 20 రకాల వంటకాలతో, పాలు మరియు చక్కెరతో చేసిన పాయాసంతో ‘ఓన సధ్య’ సామూహికంగా స్వీకరిస్తారు. సాంప్రదాయక ఊరగాయలు అప్పడములు మరియు దానితో పాటు ఇతర సాంప్రదాయ భారతీయ పిండివంటలు కూడా వడ్డిస్తారు. చాపపై కూర్చుని అరటి ఆకులో ఈ పదార్థాలను తినడం ఓనం ప్రత్యేకత. ఇందులో తప్పక పాలుపంచుకోవాలనే ఆచారం వారికి ఉంది.. అన్నిటికంటే ఓనం పండగ పాయసం చాలా బాగా ఉంటుంది.

Also Read: — నాన్న సినిమా ఆడకపోయినా పరవాలేదు-రామ్ చరణ్

అందరూ జరుపుకొనే పండగ:

కేరళలో ఉన్న అన్ని వర్గాల ప్రజలు ఈ పండగను జరుపుకోవడంతో ఓనం కి ఇంత ప్రాధాన్యత వచ్చింది.