రక్షా బంధన్ ప్రాముఖ్యత..!

రక్షా బంధన్ ప్రాముఖ్యత..!

ప్రతి ఏటా శ్రావణమాసంలో వచ్చే రాఖీ పర్వదినాన్ని కులమతాలకు అతీతంగా మన రాష్ట్రంతో పాటు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు జరుపుకుంటారు.”రాఖి”రక్షా బంధన్,రాఖి పౌర్ణమి అని పిలిచే ఈ పండుగ కొని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి అని కూడా పిలుస్తారు.అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీకగా ఈ పండగను జరుపుకుంటారు.ఉత్తర పశ్చిమ భారతదేశాలలో ఈ పండుగను చాలా వైభవవంగా జరుపుకునేవారు.సోదరి తన సోదరుడు ఉన్నత స్థానానికి ఎదగాలి అని కోరుకుంటూ కట్టేదే ఈ రాఖి.

Raksha Bandhan

పూర్వం దేవతలు రాక్షుసులకు మద్య పుష్కర కలం యుద్ధం జరిగింది.యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు  నిర్వీర్యుడై, తన పరివారమంతటినీ కూడగట్టుకొని అమరావతి  లో తలదాచుకుంటాడు. భర్త నిస్సాహాయతను చూసిన ఇంద్రాణి తరుణోపాయం ఆలోచిస్తుంది. రాక్షస రాజు అమరావతిని దిగ్బంధనం చేస్తున్నాడని తెలుసుకొని భర్త  దేవేంద్రుడికి సమరం చేయడానికి ఉత్సాహాన్ని కల్పిస్తుంది. సరిగ్గా ఆ రోజు రావణ పౌర్ణమి కావడంతో పార్వతి పరమేశ్వరులు ను లక్ష్మీనారాయణులను పూజించి రక్షాను దేవేంద్రుడికి చేతికి కడుతుంది. అది గమనించిన దేవతలందరూ వారు పూజించిన రక్షలను తీసుకువచ్చి ఇంద్రుడికి కట్టి పంపుతారు. సమరంలో గెలిచిన ఇంద్రుడు తిరిగి త్రిలోక ఆధిపత్యాన్ని పొందుతాడు.శచీదేవి ప్రారంభించిన ఆ రక్షాబంధనం.నేడు రాఖీ పండుగగా ఆచారమైందని పురాణాలూ చెపుతున్నాయి.

Raksha Bandhan

పురాణాల  ప్రకారం చూస్తే ద్రౌపతి,శ్రీకృష్ణుడు,కి అన్నాచెల్లెల అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా కనిపిస్తుంది.శిశుపాలుడుని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుని చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుందట. అది గమనించిన ద్రౌపది తన పట్టుచీర కొంగు చింపి వేలికి కట్టు కట్టిందట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉంటానని శ్రీకృష్ణుడు  ద్రౌపదికి హామీ ఇస్తాడు.

శ్రీ మహావిష్ణు బాలి చక్రవర్తి కోరిక మేరకు అతనితోపాటు పాతాళంలో ఉండిపోతాడు. శ్రీమహాలక్ష్మి వెళ్లి బలిచక్రవర్తికి రక్షాబంధంకట్టి  తన భర్తను వైకుంఠానికి తీసుకొనిపోతుంది. అందుకే రక్షాబంధానికి ఇంత ప్రాధాన్యత వచ్చింది.

పురాణాలే కాదు చ‌రిత్ర‌లో కూడా రాఖీకి సంబంధించిన క‌థ‌లు చాలానే ఉన్నాయి. మ‌న దేశం మీద‌కి అల‌గ్జాండ‌ర్ దండెత్తి వ‌చ్చిన‌ప్ప‌డు, అత‌ణ్ని పురుషోత్త‌ముడు అనే రాజు ఎదుర్కొన్నాడు. రోజులు గ‌డిచే కొద్దీ యుద్ధంలో పురుషోత్త‌ముడిదే పైచేయిలా క‌నిపించ‌సాగింది. అత‌ని చేతిలో అల‌గ్జాండ‌ర్ చ‌నిపోవ‌డం ఖాయ‌మనుకున్నారంతా. ఆ విష‌యం తెలుసుకొన్న అలెగ్జాండ‌ర్ భార్య రొక్సానా, పురుషోత్త‌ముడికి ఒక రాఖీని పంపింద‌ని చెబుతారు.ఆ త‌రువాత యుద్ధంలో అలెగ్జాండ‌ర్ని హ‌త‌మార్చే అవ‌కాశం వ‌చ్చినా పురుషోత్త‌ముడు త‌న మాట‌ను నిల‌బెట్టుకున్నాడ‌ట‌.

1905లో బెంగాల్ విభ‌జ‌న స‌మ‌యంలో ర‌వీంద్ర‌నాథ్ టాగూర్ ప్ర‌జ‌లంతా ఒక్క‌ట‌య్యేందుకు ర‌క్షాబంధ‌నాన్ని ఒక ఉద్య‌మంలా నిర్వ‌హించేవారు. రాఖీ పండుగ ఈనాటిదా! ఒక‌ప్పుడు యుద్ధానికి వెళ్లే వీరుల‌కు విజ‌యం ద‌క్కాల‌ని కోరుకుంటూ, స్ర్తీలు ర‌క్షాబంధ‌నాల‌ను చేతికి క‌ట్టేవారు.

Raksha Bandhan

రాఖీపండుగ వచ్చిందంటే ఇళ్లంతా సందడి, సందడిగా ఉంటుంది. చిన్న, పెద్ద అన్న తేడా లేకుండా అన్ని వయస్సుల వారు రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకుంటారు