టీం ఇండియాను ఆ అంకె వెక్కిరిస్తుంది…

team india , trendingandhra

అంతర్జాతీయ క్రికెట్ లో వన్డేల్లో 300 తక్కువ స్కోర్ కాదు. కొన్ని సందర్భాల్లో ప్రత్యర్ధులు ఆ లక్ష్యాన్ని చేధిస్తూ ఉంటాయి. టీం ఇండియా లాంటి అగ్రశ్రేణి జట్లు అయితే ఆ లక్ష్యాన్ని కాపడుకుంటాయి. కాని ఒక లక్ష్యాన్ని మాత్రం టీం ఇండియా కాపాడుకోలేక విఫలమవుతుంది. ఒకసారి కాదు మూడు సార్లు ఇదే జరిగింది. ఆ స్కోరే 321. 2007లో తొలిసారి పాకిస్తాన్ తో మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్ల 9 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ఆ తర్వాత పాక్ ఆటగాళ్ళు చెలరేగి ఆడటంతో ఆ లక్ష్యం చిన్నబోయింది. 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 6 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది. ఓవల్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక 48.4 ఓవర్లలో 322 పరుగులు సాధించి విజయం సాధించింది. తాజాగా విశాక వేదికగా జరిగిన మ్యాచ్ లో భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 321 పరుగులే చేసింది. ఆఖరి బంతి వరకు కొనసాగిన ఈ మ్యాచ్ లో విండీస్ విజయం సాధించింది.