హాంగ్‌కాంగ్‌తో రోహిత్‌సేన ఢీ……పసికూన నిలువగలదా ….!

మెన్ ఇన్ బ్లు .ఆసియా కప్ లో నేటి నుండి పోరాటం మొదలుపెట్టనుంది , ఈ రోజు పసికూన హాంగ్ కాంగ్ తో భారత్ ఢీ కొట్టనుంది . తొలి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన హాంగ్‌కాంగ్‌ నేడు బలమైన భారత్‌ ముందు నిలబడగలదా, పసికూనలపై తిరుగులేని విజయాల రికార్డున్న టీమ్‌ ఇండియా మళ్ళీ అదే పునరావృతం చేసేందుకు సిద్ధమవుతోంది.

క్రికెట్ సూపర్‌స్టార్‌ విరాట్‌ కోహ్లి లేడు, టీం లో మిడిల్‌ ఆర్డర్‌లో స్థిరత్వం లేదు. 2019 ప్రపంచకప్‌కు ముందు కొన్ని చిక్కుముడులకు సమాధానాల కోసం దుబారుకి వచ్చిన టీమ్‌ ఇండియా నేడు ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది.

లి మ్యాచ్‌లో పాకిస్థాన్‌ చేతిలో చిత్తుగా ఓడిన హాంగ్‌కాంగ్‌ నేడు భారత్‌తో తలపడనున్నది. రోహిత్‌ శర్మ తొలిసారి ఓ మేజర్‌ టోర్నీలో భారత్‌కు సారథ్యం వహిస్తున్నాడు . టోర్నీలో భారత్‌ ఘన బోణీ దాదాపుగా లాంఛనమే. బలమైన భారత్‌కు హాంకాంగ్‌ కనీస పోటీ ఇవ్వడం కూడా కష్టమేనని భావిస్తున్నారు. అయినా ఈ మ్యాచ్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో బుధవారం జరిగే పోరుకు ప్రాక్టీస్‌ లాంటిదే.