పోవార్‌, పృథ్వీషాపై బీసీసీఐ ఫోక‌స్‌..!

BCCI Focus on Powar and Prudvisha, trending Andhra
మ‌హిళ‌ల జ‌ట్టుకు కోచ్‌ను నియ‌మించేందుకు బీసీసీఐ స‌న్నాహాలు చేస్తుంది. ప్ర‌స్తుత కోచ్ ర‌మేష్ ప‌వార్ ప‌ద‌వీ కాలం నిన్న‌టితో ముగియ‌నుండ‌టంతో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకుంది. గ‌త కొంత‌కాలంగా ర‌మేష్ ప‌వార్‌ను అనేక స‌మ‌స్య‌లు చుట్టిముట్టిన సంగ‌తి తెలిసిందే. మ‌హిళ‌ల ప్ర‌పంచ క‌ప్ సెమీ ఫైన‌ల్‌లో మిథాలీరాజ్‌ను త‌ప్పించ‌డంపై ప‌వార్ మీద విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. 
 
అయితే, కోచ్ ప‌ద‌వీ కాలం పొడిగించే అవ‌కాశం ఉన్నా ఈ విమ‌ర్శ‌ల‌తో ఆయ‌న్ను కోచ్‌గా కొన‌సాగించేందుకు బీసీసీఐ అధికారులు అయిష్ట‌త చూపుతున్న‌ట్టు తెలుస్తుంది. ఇక కోచ్ ప‌ద‌వికి ఆస‌క్తి ఉన్న వారి నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించ‌డానికి చివ‌రి తేదీని కూడా నిర్ణ‌యించింది. డిసెంబ‌ర్ 14లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. 
అనంత‌రం డిసెంబ‌ర్ 20న ముంబైలోని కార్యాల‌యంలో ఇంట‌ర్వ్యూ ఉంటుంద‌ని బీసీసీఐ అధికారులు తెలిపారు. 
Related image
ఇదిలా ఉండ‌గా, ఆస్ట్రేలియాకు టెస్టు సిరీస్‌కు ముందే భార‌త్‌కు ఎదురుదెబ్బ త‌గిలింది. ఆస్ట్రేలియా ఎలెవ‌న్‌తో స‌న్నాహ‌క మ్యాచ్‌లో పృథ్వీషా గాయ‌ప‌డ్డాడు. ఫీల్డింగ్ చేస్తుండ‌గా ఆయ‌న కాలి మ‌డ‌మ‌కు గాయ‌మైంది. అంత‌కు ముందు ఆస్ట్రేలియా ఎలెవ‌న్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో పృథ్వీ షా దూకుడుగా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అడిలెడ్ వేదిక‌గా తొలి టెస్టు డిసెంబ‌ర్ 6న ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే టీ 20 సిరీస్‌ను భార‌త్ 1-1తో స‌మం చేసింది.