ప్రముఖ నిర్మాత కన్నుమూత

ప్రముఖ చిత్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ ఎం.భక్తవత్సలం ఆదివారం కన్ను మూశారు. అన్ని కన్నడ చిత్రాలను ఈయన నిర్మాత వ్యవహరించారు. నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.

1971లో ‘సంపూర్ణ రామాయణం’ చిత్రం ద్వారా భక్తవత్సలం నిర్మాతగా సినీరంగంలో ప్రవేశించారు. బి.వి.కారంత్‌ నటించిన ‘కన్నేశ్వర రామ’తోపాటు పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. కర్ణాటక చలనచిత్ర వాణిజ్యమండలికి ఏడేళ్ళపాటు అధ్యక్షుడిగా కొనసాగారు.

సౌత్‌ ఇండియన్‌ ఫిలిం చాంబర్‌ అధ్యక్షుడిగా, ఫిలిం ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు ఎంపికైన అతి చిన్న వయస్కుడిగా కూడా ఆయన రికార్డు నిలిచారు. భక్తవత్సలం గారు కన్నడ సినిమారంగం అభివృద్ధికి ఎనలేని కృషి చేసారు. ఈయన బెంగళూరులోని శారద, మినర్వ, లావణ్య, మైసూరులోని లక్ష్మీ సినిమా టాకీస్‌లకు యజమానిగా ఉన్నారు. ప్రస్తుత కన్నడ చలనచిత్ర వాణిజ్యమండలి అధ్యక్షుడు ఉన్న చెన్నేగౌడ సంతాపం వ్యక్తం చేశారు. సినిమా రంగానికి చెందిన దర్శక, నిర్మాత, నటులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియ చేసారు