వైసీపీని అభినందించిన టీడీపీ యువ ఎంపీ ..ఎందుకో తెలుసా …!

MP Ram mohan naidu , trendingandhra

‘తితలీ’ తుఫానుతో అతలాకుతలమైన శ్రీకాకుళం జిల్లాను ఆదుకోవడానికి పలువురు ప్రముఖులు నడుం బిగించి తమవంతుగా సాయం చేస్తున్నారు. సినీ హీరోలు మొదలుకుని పారిశ్రామికవేత్తల వరకు బాధితులను ఆదుకోవడానికి ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ సోమవారం నాడు కోటి రూపాయిలు విరాళంగా ప్రకటించింది. మరోవైపు శ్రీకాకుళం జిల్లాలోని వైసీపీ నేతలు, కార్యకర్తలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని ఆ పార్టీ పేర్కొంది.

cyclone titli, titli , trendingandhra

వైసీపీ ప్రకటించిన కోటి రూపాయల విరాళంపై టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘తుఫాను బాధితులకు విరాళం ప్రకటించిన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. రాజకీయాలు పక్కనబెట్టి పార్టీలకు అతీతంగా తుఫాను బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలి’’ అని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు.