శ్రీనివాస్ నెక్స్ట్ మూవీ దర్శకుడు అతనే……..!

బెల్లం కొండ సాయి శ్రీనివాస్ కెరీర్ స్టార్టింగ్ లో పర్వాలేదు అనిపించుకుని,జయ జానకి నాయక చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ కుర్ర హీరో ప్రస్తుతం సాక్ష్యం చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

వేసవిలో ఈ సినిమా ప్రేక్షకులముందుకు రానుండగా, శ్రీనివాస్ తదుపరి సినిమాకి సన్నాహాలు జరిగిపోతున్నాయి.’సాక్ష్యం’ తరువాత ఓంకార్ దర్శకత్వంలో శ్రీనివాస్ ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.అయితే ఆ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది.

srenivas next movie director 1
srenivas next movie director 1

నూతన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి బెల్లంకొండ శ్రీనివాస్ రెడీ అవుతున్నాడని అంటున్నారు.ఈ నెల 23వ తేదీ నుంచి ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోనుందనీ,మార్చి 2వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెబుతున్నారు.
మల్టీ డైమన్షన్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని సమకూర్చనున్నాడు. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.