జగన్‌పై దాడి చేసిన శ్రీనివాస్ తల్లిదండ్రులు ఏమన్నారో తెలిస్తే షాక్ అవుతారు

srinivas parents ,trendingandhra

వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత జగన్‌పై శ్రీనివాస్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ దాడి గురించి నింధితుడు శ్రీనివాస్ తల్లిదండ్రులు స్పందించారు. వైయస్ జగన్‌కు తమ అబ్బాయి (శ్రీనివాస్) వీరాభిమానని, అయితే ఇలాంటి దుశ్చర్యకు ఎలా పాల్పడ్డాడనేది తమకే అర్థం కావడం లేదని బోరున విలపించారు.

jagan , trendingandhra

శ్రీనివాస్ తండ్రి మాట్లాడుతూ ‘‘మాకు ఆరుగురు సంతానం. అందులో చిన్నవాడు శ్రీనివాస్. శ్రీనివాస్ ఎప్పటి నుంచో జగన్‌కు వీరాభిమాని. ఏ పార్టీ కార్యక్రమమైనా, ఏ పండగైనా జగన్‌‌కు వైసీపీకి మద్దతుగా ఫ్లెక్సీలాంటివి ఏర్పాటు చేస్తాడు. కొంతకాలంగా విశాఖపట్నంలో పని చేస్తున్నాడు. బాగానే ఉన్నానని మాతో చెప్పినప్పటికీ అక్కడి పరిస్థితులేంటో తెలియదు. జగన్‌పై జరిగిన దాడి కూడా మాకు చాలా ఆలస్యంగా తెలిసింది’’ అని చెప్పాడు.

srinivasarao parents,trendingandhra

శ్రీనివాస్ తల్లి మాట్లాడుతూ ‘‘శ్రీనివాస్‌కు జగన్ అంటే ప్రత్యేకమైన అభిమానం. మా కుటుంబం మొత్తానికి జగన్ అంటే ఎంతో అభిమానం. అయితే ఇలా ఎందుకు చేశాడని మాత్రం అర్థం కావడం లేదు’’ అని మీడియాతో పేర్కొంది.

#SrinivasParentsResponseAboutMurderAttemptOnYSJaganMohanReddy #Srinivas #Jagan