శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల….ఎలక్ట్రానిక్ లాటరీ ద్వారా భక్తుల ఎంపిక…..!

srivari arjitha seva tickets , TrendingAndhra

వచ్చే ఏడాది జనవరిలో జరిగే శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు తిరుమల, తిరుపతి దేవస్థానం . రేపు టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఇందులో భాగంగా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, నిజపాద దర్శనం టికెట్లను జారీ చేయనున్నారు.

TTD , Arjitha seva , TrendingAndhra

రేపు ఉదయం 10 గంటల నుంచి  భక్తులు టికెట్ల కోసం తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. పేర్ల నమోదు తర్వాత అధికారులు ఎలక్ట్రానిక్ లాటరీ విధానం ద్వారా భక్తులను ఎంపిక చేస్తారు. ఇలా స్వామివారి సేవా టికెట్లను దక్కించుకున్న భక్తులు.. ఆన్ లైన్ లో నగదును చెల్లించాల్సి ఉంటుంది. కళ్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టికెట్ల కోసం టీటీడీ వెబ్ సైట్ లో పేర్లను నమోదు చేసుకోవచ్చు.

TTD , Srivariseva , Trendingandhra

కాగా, టీటీడీలో భక్తుల అనుమానాలు, సమస్యలపై డయల్ టీటీడీ ఈవో కార్యక్రమంలో ఆలయ ఈవో అనిల్ కుమార్ భక్తుల సందేహాలను నివృత్తి చేస్తారు. భక్తులు 0877-2263261 ఫోన్‌ నంబరు ద్వారా ఈవోతో మాట్లాడవచ్చు.