తాత పాత్రలో మనమడు

ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ మారిన సినిమా. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్యం వహిస్తున్నాడు. రీసెంట్ గా క్రిష్ జాగర్లమూడి, నందమూరి బాలకృష్ణ, రానా చంద్రబాబును కలిసిన సంగతి మీకు తెలిసిందే. ఇప్పుడు వీరు తాజాగా ఏఎన్నార్ పాత్ర కోసం తన మనమడు సుమంత్ ను కలిసి `యన్.టి.ఆర్` కథ చెప్పారంట. ఈ కథ విన్నాక, తన తాత పాత్రకు ఉన్న ప్రాధాన్యం తెలుసుకున్నాక వెంటనే ఓకే చెప్పారట సుమంత్.
అయితే `మహానటి`లో ఏఎన్నార్ పాత్రను నాగచైతన్య పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సుమంత్ ని సంప్రదించారు. తెలుగు సినిమాకు యన్.టి.ఆర్, ఏఎన్నార్ రెండు కళ్ళు అన్న సంగతి అందరికి
తెలిసిందే. అందులోనూ ఈ సినిమాలో యన్.టి.ఆర్గా బాలకృష్ణ నటిస్తున్నారు. ఆయన సరసన కొన్ని సన్నివేశాల్లోనైనా ఎ.ఎన్.ఆర్ పాత్ర ఉంటుంది. దాన్ని బట్టి సుమంత్ ఆ పాత్ర కోసం సిద్ధమవుతున్నారట. ఆయన ప్రస్తుతం `సుబ్రమణ్యపురం` షూటింగ్లో ఉన్నారు. `యన్.టి.ఆర్` బయోపిక్ గురించి “ చాలా ఆనందంగా, అత్యుత్సాహంగా, గౌరవంగా ఉంది. యన్.టి.ఆర్గారి బయోపిక్లో తాతగారి పాత్రలో నటించబోతున్నాను ` అని ప్రకటించారు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుందని సమాచారం.