ఆరెంజ్ ఆర్మీ థ్రిలింగ్ విక్టరీ…..రోహిత్ సేన మరో సారి డీలా….!

ఐపీయల్ మజా ఆలా ఉంటుందో అభిమానులకి మరో సారి రాత్రి జరిగిన మ్యాచ్ రుచి చూపించింది. సొంతగడ్డపై సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మళ్ళి తమకు తిరుగు లేదని నిరూపించుకున్నది. ఆరెంజ్ ఆర్మీ వరుసగా రెండో విక్టరీ ని నమోదుచేసింది . నిన్న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ లో ఒక వికెట్‌ తేడాతో గెలిచి గట్టెక్కింది.శిఖర్‌ ధవన్‌ 45 , మరోసారి విజృంభించగా ఆఖర్లో దీపక్‌ హూడా 32 నాటౌట్‌, సత్తా చాటడంతో ముంబై నిర్దేశించిన 148 పరుగు ల లక్ష్యాన్ని రైజర్స్‌ 9 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది.తొలుత ముంబై 8 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఎవిన్‌ లెవిస్‌ (29), సూర్యకుమార్‌ యాదవ్‌ 28, కీరన్‌ పొలార్డ్‌ 28 , తప్ప మిగతా బ్యాట్స్‌మన్‌ నిరాశ పరిచారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో సందీప్‌, స్టాన్‌లేక్‌, సిద్దార్థ్‌ కౌల్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. రషీద్‌ ఖాన్‌ 4 వికెట్స్ తో ఆకట్టుకున్నాడు.
తోలి ఓవర్ నుండి ధావన్ తన మెరుపులతో ఆరెంజ్ ఆర్మీ కి మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. మరో ఓపెనర్ సహా కూడా 22 పరుగులతో సత్తా చాటుడు. తరువాత అందరూ వెనువెంటనే పెవిలియన్ బాట పట్టారు. దీనితో చివరలో బుమ్రా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి మ్యాచ్ ను మలుపు తిప్పాడు.చివరి ఓవర్లో సన్ రైజర్స్ కి 11 పరుగులు అవసరమవగా, చేతిలో ఒక వికెట్‌ మాత్రమే ఉన్నది. చివరి ఓవర్ వేయడానికి కటింగ్‌ బాల్ ను అందుకున్నాడు, బ్యాట్‌తో దీపక్‌ హూడా సిద్ధంగా వున్నాడు, ఫుల్‌లెంగ్త్‌లో వచ్చిన తొలి బంతిని దీపక్‌ సిక్సర్‌గా మలచడంతో స్టేడియం ఒక్కసారిగా మార్మోగింది. తర్వాత వైడ్‌ రావడంతో 5 బంతుల్లో 4 పరుగుల అవసరం కాగా, రెండో బంతికి పరుగు రాలేదు. తర్వాతి మూడు బంతుల్లో మూడు సింగిల్స్‌ వచ్చాయి. ఆఖరి బంతికి ఒక పరుగు అవసరం అవగా స్టాన్‌లేక్‌ 5 నాటౌట్‌, బౌండ్రీ కొట్టి జట్టును గెలిపించాడు.