శబరిమల ఆలయంలోకి మహిళలు …. సుప్రీం గ్రీన్ సిగ్నల్…

sabarimala , supreme court , trendingandhra

సెక్షన్ 497పై సంచలన తీర్పును ప్రకటించిన సుప్రీంకోర్టు నేడు మరో కీలక తీర్పును ఇచ్చింది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి అనుమతినిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. ఇన్నాళ్లూ మహిళల ఆలయ ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఆలయాల్లో లింగవివక్షకు తావులేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పురుషుల కంటే మహిళలు తక్కువేం కాదని స్పష్టం చేసింది. ఓ వైపు దేవతలను పూజిస్తూ మరోవైపు మహిళలపై ఆంక్షలు విధించడం సరికాదని సుప్రీం తెలిపింది.
Supreme-Court , trendingandhra
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ నారీమన్‌, జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ ఇందూ మల్హోత్రాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం నాడు ముక్తకంఠంతో తీర్పు చెప్పింది.

ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా మాట్లాడుతూ.. మహిళలను దేవతలుగా పూజించే దేశం మనదని.. వారు దేనిలోనూ తక్కువేమీ కాదన్నారు. మతమనేది ప్రాథమిక జీవనవిధానంలో భాగమేనని సీజే దీపక్ మిశ్రా చెప్పుకొచ్చారు.