అలోక్ వర్మ పిటీషన్ పై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం

supreme court , trendingandhra

సీబీఐ లో జరిగిన అవినీతి భాగోతం బయటకు రావటం తో సీబీఐ డైరెక్టర్లు అలోక్ వర్మ, రాకేశ్ ఆస్థానాలను సెలవుపై పంపించి ఆ స్థానంలో కొత్త డైరెక్టర్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ అలోక్ వర్మ దాఖలు చేసిన పిటీషన్ ను విచారణకు స్వీకరించి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు సంచలన నిర్ణయాన్ని వెల్లడించింది. గడిచిన రెండు.. మూడు రోజులుగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సీబీఐ వ్యవహారాలకు సంబంధించి సుప్రీం స్పందించింది. సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం సంచలన నిర్ణయాల్ని వెల్లడించింది.

supreme court,trendingandhra

తనను సీబీఐ డైరెక్టర్ విధుల్లో నుంచి తప్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తున్నారు అలోక్ వర్మ. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం త్రిసభ్య ధర్మాసనం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది.అలోక్ వర్మపై విచారణను రెండు వారాల్లో పూర్తి చేయాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ను ఆదేశించటంతోపాటు.. తాత్కాలిక సీబీఐ చీఫ్ గా నియమితులైన మన్నెం నాగేశ్వరరావును ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని కోర్టు స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు.

alok varma,trendingandhra

రోజువారీ విధులు మాత్రం చేపట్టాలని చెప్పిన సుప్రీం ధర్మాసనం.. సీబీఐ విచారణ అధికారుల్ని మార్చటం.. బదిలీ చేయటం లాంటి అంశాలతో పాటు మిగిలిననిర్ణయాలకు సంబంధించిన అంశాలపై వివరాల్ని నవంబరు 12లోపు సీల్డ్ కవర్ లో కోర్టుకు అందజేయాలని ఆదేశించింది.
అంతేకాదు.. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై సెక్రటేరియట్ నోట్లో పేర్కొన్న ఆరోపణలపై విచారణను రెండు వారాల్లో పూర్తి చేయాలి కోరారు. ఇదిలా ఉంటే.. అలోక్ వర్మకు సంబంధించిన దర్యాప్తునకు ఇచ్చిన 10 రోజుల సమయం సరిపోదని.. గడువునుమూడు వారాలు ఇవ్వాలన్న వినతికి సుప్రీం నో చెప్పింది. రెండు వారాల్లో దర్యాప్తు ముగించాలని సోలిసిట్ జనరల్ తుషార్ మెహతాకు స్పష్టం చేసింది. సీబీఐ ఇష్యూలో మోడీ సర్కారు తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో పాటు.. సీబీఐ తాత్కాలిక చీఫ్ గా ఎంపిక చేసిన మన్నెం నాగేశ్వరరావుకు పరిమితులు విధిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.