RX 100 తమిళ్ వెర్షన్ హీరో, హీరోయిన్ వీరే….

RX 100 తమిళ్ వెర్షన్ హీరో, హీరోయిన్ వీరే….
తెలుగు లో అజయ్ భూపతి దర్శకత్యం లో నూతన నటీనటులతో తెరకెక్కించిన చిత్రం ‘ఆర్ఎక్స్ 100’. ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో మనకి తెలిసిందే. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా తక్కువ బడ్జెట్ తో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో దీన్ని ఇతర భాషల్లో తీసేందుకు నిర్మాతలు పోటీ పడుతున్నారు.

తాజాగా అవురా సినిమాస్ సంస్థ ఈ సినిమాను తమిళంలో తీస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాలో హీరో గా ఆది పినిశెట్టిని, హీరోయిన్ గా తాప్సీని తీసుకున్నట్లు నిర్మాతలు తెలియచేసారు. తమిళ వెర్షన్ ఆర్ఎక్స్ 100 సినిమాకు ఇంకా దర్శకుడు ఎవరో ఖరారు కాలేదు. అక్టోబర్ మూడో వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం