బట్టలు విప్పేసి డ్యాన్స్ చేయాలని ఆ దర్శకుడు వేధించాడు……

Thanushree dutta , vivek Agnihotri , trendingandhra
ప్రముఖ నటుడు నానా పటేకర్, డ్యాన్స్ మాస్టర్ గణేశ్ ఆచార్య తనను లైంగికంగా వేధించారని హీరోయిన్ తనుశ్రీ దత్తా బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల క్రితం ‘హారన్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్ లో తనను నానా పటేకర్ వేధించాడని ఆమె చెప్పుకొచ్చింది. తాజాగా తనుశ్రీ మరో సంచలన విషయం బయటపెట్టింది. బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి సినిమా షూటింగ్ సందర్భంగా తనపట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాడనీ, లైంగికంగా వేధించాడని ఆరోపించింది.

tanushree dutta , trendingandhra

డీప్‌ డార్క్‌ సీక్రెట్స్‌’ సినిమా షూటింగ్ సందర్భంగా వివేక్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తనుశ్రీ దత్తా చెప్పింది. సినిమా షూటింగ్ లో ఓ పాట సందర్భంగా దుస్తులు విప్పి డ్యాన్స్ చేయాల్సిందిగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వేధించాడని ఆవేదన వ్యక్తం చేసింది. కానీ అక్కడే ఉన్న సునీల్ శెట్టి, ఇర్ఫాన్ ఖాన్ తనను రక్షించారని వెల్లడించింది. ఈ సందర్భంగా వివేక్ పై వారిద్దరూ ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొంది. మరోవైపు బాలీవుడ్ లో లైంగిక వేధింపులను బయటపెట్టిన తనుశ్రీకి ఫర్హాన్ అక్తర్, ప్రియాంక చోప్రా, రిచా చద్దా, ట్వింకిల్ ఖన్నా మద్దతుగా నిలిచారు.