మహాకూటమిని లక్ష్యంగా చేస్తారా..?

mahakutami,trendingandhra

విశాఖ విమానాశ్రయంలో విపక్ష నేత జగన్ పై జరిగిన దాడి విషయంలో మహాకూటమిని కూడా టార్గెట్ చేస్తారా..? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. మహాకూటమి అధికారంలోకి వస్తే ఇలాంటి పరిస్థితులు ఉంటాయని ఇటీవల అరకు ఎమ్మెల్యేపై జరిగిన దాడి సహా అనేక విషయాలను ప్రస్తావిస్తూ జగన్ పై జరిగిన దాడిని కూడా తెరాస నేతలు వాడుకుని ప్రచారం చేసే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. దాడి జరిగిన వెంటనే గవర్నర్ స్పందించడం, కెసిఆర్ స్పందించడం, కేటిఆర్ స్పందించడం, కవిత స్పందించడం వంటి వాటిపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణాలో ఎన్నికలు దగ్గరలో ఉన్న నేపధ్యంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తెలుగుదేశం నేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శల దాడి చేసే అవకాశాలు ఉన్నాయి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అరకు విషయాన్ని తెలంగాణా ప్రజల్లో బలంగా తీసుకుని వెళ్ళే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.