వైసీపీకి మైండ్ బ్లాంక్ అయ్యే దెబ్బ కొట్టనున్న టీడీపీ

tdp give shock to ycp,jagan mohan reddy,ys jaganmohan reddy,ycp leader ys jagan mohan reddy,trendingandhra

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార టీడీపీ వైసీపీ ని దెబ్బ కొట్టే ప్లాన్ చేస్తుంది. వైసీపీ కి అనుకూలంగా ప్రభుత్వం పై వ్యతిరేకత పెంచేలా రకరకాల గాసిప్స్ సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్న ప్రమోటర్ల భరతం పట్టాలని టీడీపీ భావిస్తుంది. సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ అధికార టీడీపీ..ప్ర‌తిప‌క్ష వైసీపీకి ఇచ్చే షాక్ అలాంటి ఇలాంటి షాక్ కాదు సోషల్ మీడియా షాకే అయ్యే షాక్ అని ఇప్పటికే ప్రచారం సాగుతుంది.
అసలు విషయానికొస్తే ఎల‌క్ట్రానిక్ మీడియా స్ట్రీమ్‌లో త‌న హ‌వా కొన‌సాగిస్తున్న టీడీపీకి సోష‌ల్ మీడియాలో పెద్ద‌గా ప‌ట్టు లేదు. మ‌రోవైపు వైసీపీకి ఎల‌క్ట్రానిక్ మీడియా స్ట్రీమ్‌ల‌లో ప‌ట్టు లేదు కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం విపరీతమైన పట్టుంది. ఎంత‌లా అంటే టీడీపీ శ్రేణుల‌కి ఊపిరి ఆడ‌కుండా చేస్తుంది సోష‌ల్ మీడియా. దీంతో సోష‌ల్ మీడియా పై చంద్ర‌బాబు స‌ర్కార్ ఉక్కుపాదం మోప‌నుంద‌ని తెలుస్తుంది.
సోష‌ల్ మీడియ‌లో వైసీపీ ప్ర‌చారం పీక్స్‌కు చేరింది. చంద్ర‌బాబుతో స‌హా తెలుగు త‌మ్ముళ్ళు ఏదైనా చిన్న‌మిస్టేక్ చేయ‌గానే.. వారిని ఆడేసుకుంటుంది సోష‌ల్ మీడియా. దీంతో టీడీపీ వ్యూహాత్మంగా వైసీపీకి సపోర్ట్ చేస్తున్న ప‌లువురు సోష‌ల్ మీడియా ప్ర‌మోట‌ర్ల పై కేసులు న‌మోదు చేసి అరెస్టులు చేసేందుకు టీడీపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంద‌ని స‌మాచారం. ఇక ఇప్ప‌టికే ప‌లువురు వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్లుల‌ను కేసులంటూ ఇబ్బంది పెట్టిన టీడీపీ మ‌రోసారి అదే ఫార్ములాను వాడి వైసీపీని దెబ్బ తీయాల‌ని భావిస్తుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాకుండా సోష‌ల్ మీడియాలో కూడా చర్చ నడుస్తుంది. మ‌రి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఈ రచ్చ ఎక్కడికి చేరుతుందో.