జ‌గ‌న్‌, ప‌వ‌న్‌కు టీడీపీ నేత స‌వాల్‌..!

TDP leader comments on jagan and pawan,trendingandhra
 
డిసెంబ‌ర్ 7వ తేదీన తెలంగాణలో పోలింగ్ జ‌ర‌గ‌నుండ‌టంతో రాజ‌కీయ పార్టీలు ప్ర‌చారాన్ని మ‌రింత ముమ్మ‌రం చేశాయి. కాంగ్రెస్ ప్ర‌ధాన పార్టీగా తెరాస‌, సీపీఐ, తెజ‌సా ఇలా ప‌లు పార్టీలు మ‌హాకూట‌మిగా ఏర్ప‌డ‌గా, మ‌రో వైపు టీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలు ఒంట‌రిగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగాయి. అయితే, తెలంగాణ ఎన్నిక‌ల‌కు త‌మ‌కు ఏ మాత్రం సంబంధం లేద‌న్న విధంగా వైకాప అధినేత జ‌గ‌న్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డ‌మే ప్ర‌ధాన ఎజెండాగా వారిద్ద‌రూ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. 
 
ఇదిలా ఉండ‌గా, తెలంగాణ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌, ప‌వ‌న్ పోటీ చేయ‌క‌పోవ‌డంపై ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు ప‌లు ర‌కాలుగా విశ్లేష‌ణ‌లు జ‌రుపుతున్నారు. కొంద‌రైతే తెలంగాణ‌లో వైకాపాకు బ‌లం లేద‌ని, మ‌రికొంద‌రు ప‌వ‌న్ తెలంగాణ‌లోక‌న్నా.. ఏపీలో త‌మ పార్టీని కాపాడుకుంటే మేలంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. 
 
ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌, ప‌వ‌న్ తెలంగాణ‌లో పోటీ చేయ‌క‌పోవ‌డంపై ఏపీ హుడా చైర్మ‌న్ సోమిశెట్టి వెంక‌టేశ్వ‌ర్లు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌గ‌న్‌, ప‌వ‌న్‌ల‌కు సంబంధించి హైద‌రాబాద్‌లో ఉన్న అక్ర‌మాస్తుల‌ను కాపాడుకునేందుకే తాము పోటీ చేయ‌కుండా, ఏ పార్టీకి కూడా ప్ర‌త్య‌క్షంగా మ‌ద్ద‌తు తెల‌ప‌కుండా ఉన్నార‌ని, హైద‌రాబాద్‌లో వారికి ఉన్న‌వి అక్ర‌మాస్తులు కాకుంటే ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌లాగా ఆస్తులు మీడియా ముందు ప్ర‌క‌టించాల‌ని జ‌గ‌న్‌, ప‌వ‌న్‌కు స‌వాల్ విసిరారు.