టీడీపీ నేతల అసంతృప్తి… బాబు నిర్ణయమే కారణమా

 

TDP leader's dissatisfaction ... is the reason for Babu's decision only,telangana election,chandrababu,chandrababu naidu,trendingandhraతెలంగాణా ఎన్నికలకు సమయం ఎంతో లేదు. ప్రధాన పార్టీలు ఎత్తులు, పై ఎత్తులతో ప్రత్యర్థి పార్టీలను చిత్తూ చేసే యోచనలో ఉన్నాయి. అధికారాన్ని చేజిక్కించుకోవాలని విఫల యత్నం చేస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన టీఆర్ఎస్ ప్రచారమో ముందస్తు దూకుడు చూపిస్తున్నా మిగతా పార్టీలు మాత్రం ఇంకా వేగంగా ముందుకు సాగటం లేదు.
టీఆర్ఎస్ ను గద్దె దించటమే టార్గెట్ గా ఏర్పడిన కూటమి పార్టీలు సీట్ల సర్దుబాటులో జాప్యం జరుగుతుండటం తో ప్రచారంలోకి వెళ్ళటం లేదు. అయితే కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో టీడీపీ అధినేత అందరూ కలిసి వెళ్ళాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ అవసరం అయితే త్యాగానికైనా వెనుకాడ వద్దని చెప్పారు. టీజేఎస్ సీట్ల విషయంలో ఇబ్బంది తలెత్తిన నేపధ్యంలో తమ పార్టీ కి ఇచ్చే రెండు సీట్లను టీజేఎస్ కోసం త్యాగం చేసి గొడవ సద్దుమణిగేలా చేశారు. చంద్రబాబు సీట్ల సర్దుబాటు వ్యవహారంపై స్పందించిన బాబు తమకు మూడు సీట్లు తక్కువైనా పర్లేదు అని, మిత్ర ధర్మాన్ని మాత్రం టిడిపి పాటిస్తుందని ప్రకటించారు.
దీంతో మహాకూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. టీడీపీకి కేటాయించే సీట్ల విషయంలో పునరాలోచనలో పడిందట. ఇప్పటివరకు టిడిపికి 15 సీట్ల వరకు ఈ అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం టిడిపికి రెండు స్థానాలను తగ్గించి 13 సీట్లను కేటాయించబోతున్నారని తెలుస్తోంది. ఇది కాస్త తెలంగాణ టీడీపీ నేతల చెవిన పడటంతో వారు తీవ్ర మనస్తాపంతో ఉన్నారట. గతంలో అన్ని స్థానాల్లో పోటీ చేసిన పార్టీ ఈ సారి కూటమి పొత్తులలో కనీసం 15 మందికి అయినా అవకాశం వచ్చేది. బాబు మాట్లాడిన మాటల వల్లే, చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్లనే తమ పార్టీకి, కాంగ్రెస్ సీట్లు తగ్గించబోతుందని కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేతలు ఎక్కువమంది సీనియర్లే ఉన్నారని సమాచారం. చావు బతుకుల్లో ఉన్న పార్టీని బతికించేందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నా తప్పులేదని ఒక వర్గం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ అసంతృప్తులు అందరూ సీనియర్లు కావటం తో బాబు కు ఇప్పుడు తలనొప్పి తప్పేలా లేదు.