టీడీపీ నీచ రాజకీయం.. వైసీపీ హుందాతనం …!

TDP's Cheap politics .. YCP honesty!,jagan,ys jagan,ys jagan mohan reddy,chandrababu

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నం విషయంలో తెలుగుదేశం పార్టీ అత్యంత నీఛరాజకీయాన్ని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ మీద అటాక్ జరిగిన కొద్ది సేపటికే టీడీపీ వాళ్లు నీఛ రాజకీయం మొదలుపెట్టారు. అదేమిటంటే.. ఆ అటాక్ ను జగన్ తన మీద తనే చేయించుకున్నాడని టీడీపీ ఇప్పటికీ వాదిస్తోంది. అయితే ఈ విషయంలో నిరూపించలేకపోతోంది టీడీపీ.

ప్రతిపక్ష నేత మీద దాడి జరిగితే కనీసం పరామర్శించని నీఛ రాజకీయాన్ని చంద్రబాబు అవలంభిస్తున్నాడు. వేరే ఎవరైనా పరామర్శించినా బాబు సహించలేకపోయాడు.

అది మాత్రమేగాక.. జగన్ మీద అటాక్ పై టీడీపీ అధినేత అత్యంత వెకిలిగా స్పందించాడు. బాబు మాత్రమే కాదు మంత్రులందరి తీరూ అలాగే ఉందనుకోండి. అవన్నీ గాక టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ మాట్లాడిన తీరు మరోటి. అత్యంత నీఛంగా మాట్లాడాడు ఈ టీడీపీ నేత. జగన్ మీద అటాక్ ను విజయమ్మ, షర్మిలలు చేయించి ఉంటారంటూ రాజేంద్ర ప్రసాద్ విమర్శల పాలయ్యాడు. ఇతడి తీరును సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నారు.

ఇలా జగన్ పై అటాక్ విషయంలో ఎంత వరకూ దిగజారి పోవాలో టీడీపీ అంత వరకూ దిగజారిపోతూ ఉండగా.. వైసీపీ మాత్రం హుందా తనాన్ని ప్రదర్శిస్తోంది. టీడీపీ నేతలు లేకి మాటలు అన్నారని తాము అనమని.. అలిపిరిలో చంద్రబాబు మీద అటాక్ ను భువనేశ్వరి, లోకేష్ లు చేయించారని తాము అనడం లేదని.. వైసీపీ చురక అంటించిందని. టీడీపీ నేతలు కాస్త మానవత్వం ఉన్న రాజకీయాలు చేయాలని వైసీపీ నేతలు చెప్పుతో చరిచినట్టుగా చెప్పారు. టీడీపీకి ఇది సరిపోతుందా? ఇంకా వేరే ఏమైనా కావాలా?

#Jagan #JaganMohanReddy #YsJaganMohanReddy