ఏ చార్జర్ అయినా వాడొచ్చా .. ?

ఇటీవల నేను రెడ్‌మీ నోట్‌ 5 ఫోన్‌ తీసుకున్నాను. పొరబాటున మొబైల్‌ ఛార్జర్‌ మిస్‌ అయింది. బయట మార్కెట్లో ఒరిజినల్‌ ఛార్జర్‌ దొరకడం లేదు. నా మొబైల్‌కి బయట మార్కెట్లో దొరికే వేరే ఛార్జర్లు వాడొచ్చా? ఒకవేళ అలా వాడితే మొబైల్‌కి గానీ, బ్యాటరీకి గానీ ఏమైనా ఎఫెక్ట్‌ అయ్యే ఛాన్స్‌ ఉందా?
charger, trendingandhra
– కె. రాజవర్థన్‌ ఖండ్కే, కొడంగల్‌
సాధారణంగా సెల్ ఫోన్స్ ఔట్‌పుట్‌ ఓల్టేజ్‌ ఒకే విధంగా ఉన్నంతవరకు మీరు వేరే ఛార్జర్‌ ఏదైనా ఏ ఫోన్‌కైనా వాడొచ్చు. ఉదాహరణకు చెప్పాలి అంటే రెడ్‌మీ నోట్‌ 5 ఫోన్‌కి 5వి, 2.1ఎ ఔట్‌పుట్‌ ఉన్న ఛార్జర్‌ వాడతారు. సరిగ్గా ఇదే ఔట్‌పుట్‌ ఓల్టేజ్‌ ఉన్న వేరే ఛార్జర్‌ ఏదైనా మీ ఫోన్‌కి సెట్‌ అవుతుంది. ఛార్జర్‌ మీద చిన్న అక్షరాలతో ఈ వివరాలు ముద్రించబడి ఉంటాయి. వాటిని పరిశీలనగా గమనించండి. ఇకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో ఓల్టేజి సరిపోయినంత మాత్రాన మనం సేఫ్‌ అని కాదు.

charger_trendingandhra

ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్ సైట్లలో కొన్ని తక్కువ ధరకు కొన్ని నాసిరకం ఛార్జర్లు లభిస్తుంటాయి. వాటిలో పొందుపరచబడి ఉండే స్టెప్‌ డౌన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ నాసిరకం క్వాలిటీది ఉంటే అది ఫోన్‌కీ, బ్యాటరీకీ ప్రమాదకరం. అందుకే ప్రముఖ కంపెనీలు తయారు చేసిన ఇతర ఫోన్లకి చెందిన సేమ్‌ ఓల్టేజ్‌ ఉన్న ఛార్జర్లని వాడడం అన్నిటికంటే శ్రేయస్కరం ఎంటి అంటే ఒకవేళ ఇంటర్నెట్లో థర్డ్‌పార్టీ ఛార్జర్‌ కొనాల్సి వస్తే రివ్యూలు, ముఖ్యంగా రేటింగులు చదివిన తర్వాత నిర్ణయం తీసుకోండి.