టీడీపీ ఉనికి కోసం చంద్రబాబు మరో ఎత్తుగడ …..

Chandrababu , trendingandhra

రాజకీయ చదరంగంలో చంద్రబాబు ఎత్తులు పైఎత్తులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నికల వ్యూహంలో చంద్రబాబు ను మించిన నేత లేడని ఆ మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పారు. తాజాగా చంద్రబాబు నాయుడు తన మాస్టర్ మైండ్ తో మరో ఎత్తుగడ వేస్తున్నట్టు తెలుస్తుంది.

మావోయిస్టులు కాల్చి చంపిన కిడారి సర్వేశ్వరరావు కుమారుడు కిడారి శ్రావణ్‌ ను చంద్రబాబు తన మంత్రివర్గంలో తీసుకోనున్నట్టు మీడియా లో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏజెన్సీ గిరిజనుల నుంచి సానుకూల ఫలితం సాధించాలంటే ఇదే మంచి ఆలోచన అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారని తెలుస్తోంది. అదే నిజం అయితే గిరిజనుల ఓట్ల కోసం చంద్రబాబు మరో ఎత్తుగడతో వేసినట్టే అంటున్నారు విశ్లేషకులు.

ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. ఇప్పటివరకు చంద్రబాబు మంత్రివర్గంలో గిరిజనులకు ప్రాతినిధ్యం లేదన్నది గుర్తించాలి. ఇంకా ఆరునెలల్లో ఎన్నికలు ఉండటం, కిడారి హత్యకు టీడీపీ వారే కారణం అని వార్తలు రావటం తో కిడారి కుమారుడిని మంత్రివర్గంలోకి తీసుకుంటే పార్టీకి లాభం చేకూరుతుంది అన్నది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తుంది.

వాస్తవానికి అరకు గిరిజన ప్రాంతంలో టీడీపీ బలహీలంగా, వైసీపీ బలంగా ఉంది.. దీనికి గత ఎన్నికలే నిదర్శనం.. కిడారి హత్యతో ఇక్కడ టీడీపీ ఇంకా బలహీనపడింది అని చెప్పక తప్పదు. అయితే కిడారి కుమారుడికి మంత్రి పదవి ఇస్తే గిరిజనులనుంచి సానుకూల స్పందన వస్తుంది అనేది చంద్రబాబు ఆలోచన. అన్ని అనుకున్నట్టే జరిగితే ఈనెలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని రాజకీయ వర్గాల విశ్లేషణ.