అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇల్లు వేలం.

అండర్ వరల్డ్ డాన్, ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇంటిని ఎట్టకేలకు వేలంలో విక్రయించారు. దావూద్ ఇబ్రహీంకు కు ముంబై నగరంలోని పక్ మోడియా వీధిలో ఉన్న మాసుల్లా భవనాన్ని సైఫీ బుర్హానీ అప్‌లిప్ట్‌మెంట్ ట్రస్టు రూ.3.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ మూడంతస్తుల దావూద్ భవనాన్ని విక్రయించేందుకు వేలం నిర్వహించగా ట్రస్టు దాన్ని సొంతం చేసుకుంది. దావూద్ తల్లి అమీనాబి పేరిట ఉన్న అమీనా మాన్షన్ వేలంలో సుప్రీంకోర్టు న్యాయవాది, అఖిలభారత హిందూమహాసభ ప్రతినిధి భూపేంద్ర భరద్వాజ్ కూడా పాల్గొన్నారు. వేలంలో దావూద్ ఇంటిని చేజిక్కించుకున్న ట్రస్టు ఈ పురాతన భవనాన్ని కూల్చివేసి కొత్తగా భవనం నిర్మిస్తామని ప్రకటించింది.