ఓ ఈఎన్‌టీ స్పెష‌లిస్ట్ క్లినిక్‌కు ప‌దిరోజులుగా ముక్కులో నుంచి ర‌క్తం కారుతుందంటూ ఓ వ్యక్తి వచ్చాడు.

డాక్టర్ ఆ వ్యక్తి ని ర‌క్తం ఎందుకు వస్తుంది అని త‌నకు తెలిసిన ప్ర‌శ్న‌ల‌ను అడగగా .. అవేవీ కాద‌ని స‌మాధానం ఇచ్చాడా పేషెంట్‌. స‌రే! స్పెషలిస్ట్ అయిన త‌న‌కే తెలియ‌కుండా ర‌క్తం ఎలా వ‌స్తుంద‌నే అనుమానం డాక్ట‌ర్‌ను వచ్చింది.

అతన్ని టేబుల్ మీద కూర్చోబెట్టి ముక్కులో లైటు వేసి చూశాడు ఆ డాక్ట‌ర్‌. లోన ఏదో ఉబ్బెత్తుగా క‌నిపించింది. మ‌రింత ప‌రీక్షించి చూశాడు. ఆ వ్య‌క్తి ముక్కులో ఓ జీవి..ఉందని కనిపెట్టిన డాక్టర్ చిన్న సైజు ప‌ట్ట‌కారతో ముక్కులో ఉన్న జీవి బయటకి తీసాడు. అది చుసిన డాక్టర్ అది జలగ అని తెలుసుకొని నిర్గాంతపోయాడు. అది చుసిన పేషెంట్ భ‌యంతో బిగుసుకుపోయాడు .

కొద్దిరోజుల క్రితం ఆ వ్యక్తిని ఓ చెరువుకు స్నానం చేయ‌డానికి వెళ్ళాడంట. ఆ సంద‌ర్భంగా అది ముక్కులోనికి దూరి ఉంటుంద‌ని చెబుతున్నాడ‌త‌ను. చైనాలో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న, ఆ దేశానికి చెందిన చాంగ్షా లీగ‌ల్ అండ్ లెజిస్లేష‌న్ చానెల్ దీనికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది.