అరవింద సమేత’ సెట్‌లో అభయ్‌ అల్లరి‌…!

Abhayram , Aravinda sametha , Trendingandhra

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అరవింద సమేత వీరరాఘవ’. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. తమన్‌ బాణీలు సమకూరుస్తున్నారు. మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ఇప్పటి వరకు దాదాపు 65 లక్షల మందికిపైగా ఈ ప్రచార చిత్రాన్ని చూశారు. ఇప్పటికీ ఇది యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో ఉంది.

Aravinda Sametha , TrendingAndhra

కాగా బుధవారం ఈ సినిమా మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. ‘‘అరవింద సమేత’ సెట్స్‌లో ఏం జరిగిందో చూడండి’ అని హారిక అండ్‌ హాసిని సంస్థ ట్వీట్‌ చేసింది. సినిమా షూటింగ్ చాలా సరదాగా జరిగినట్లు దీన్ని చూస్తే తెలుస్తోంది. ఎన్టీఆర్‌ తనయుడు అభయ్‌ రామ్‌.. త్రివిక్రమ్‌ ఒడిలో కూర్చుని అల్లరి చేస్తూ కనిపించాడు.Jr NTr son Abhay , TrendingAndhra

ఈ చిత్రంలో ఈషా రెబ్బా, సునీల్‌, జగపతిబాబు, రావు రమేశ్‌, సితార, బ్రహ్మాజీ, నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పీసీ వినోద్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అక్టోబరు 11న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.