ఈరోజు నుండి కరుణాకరన్ ప్రాజెక్ట్ లో తేజు…!

కరుణాకరన్ ప్రేమకథలకు పెట్టింది పేరు.హీరోని లవర్ బాయ్ గా చూపించడంలో ఈ దర్శకుడి స్టైల్ వేరనే చెప్పాలి.వైవిధ్యమైన ప్రేమకథలతో కరుణాకరన్ అందరిని ఆకట్టుకుంటున్నారు.ఇటీవల సాయి ధరమ్ తేజ్ తో ఒక చిత్రాన్ని స్టార్ట్ చేసాడు.వినాయక్ సినిమాతో పాటే ఈ సినిమాను సాయిధరమ్ తేజ్ మొదలు పెట్టాడు. అయితే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ పూర్తయిన తరువాత, వినాయక్ సినిమాను ముందుగా విడుదల చేయాలనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టుకి ప్రాధాన్యతనిచ్చాడు. దాంతో కరుణాకరన్ సినిమా రెండవ షెడ్యూల్ మొదలుకావడానికి ఆలస్యమైంది.

ఈ రోజునే ఈ సినిమా రెండవ షెడ్యూల్ ను ప్రారంభించారు. ఈ షెడ్యూల్లో సాయిధరమ్ తేజ్ తో పాటు అనుపమ పరమేశ్వరన్ కూడా పాల్గొంటోంది. నాయకా నాయికల మధ్య కొన్ని కీలకమైన సన్నివేశాలను ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాకి కె. ఎస్. రామారావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోన్న కరుణాకరన్, ఈ సినిమాతో సాయిధరమ్ తేజ్ కి హిట్ ఇస్తాడేమో చూడాలి.