అక్టోబర్ 10 లేదా 12 తేదీల్లో తెలంగాణ ఎన్నికల షెడ్డ్యూల్ …..!

telangana election schedule , TS Election Schedule , trendingandhra

తెలంగాణ లో శాసన సభ రద్దు తరువాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. తెలంగాణలో ముందస్తు ఎన్నికల తేదీల ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది . శాసనసభ ఎన్నికల షెడ్యూల్‌ అక్టోబర్ నెల 10 లేదా 12 తేదీల్లో వెలువడే అవకాశం ఉందనితెలుస్తుంది .

Telangana_State_Election_Commission , trendingandhra

అదే నెలలో నామినేషన్ల ప్రక్రియ పూర్తవుతుందని, నవంబర్‌ 15-20 తేదీల మధ్య ఎప్పుడైనా పోలింగ్‌ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మిజోరంల ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటానికి ముందే తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ పూర్తవుతుందని అత్యున్నత అధికారవర్గాలు వెల్లడించాయి.
దీనితో త్వరలో తెలంగాణ లో ఎన్నికల ప్రచారాలు హోరెత్తుతాయని తెలుస్తుంది .