తెలంగాణా కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఆయనేనట

telangana latest politics in congress,telangana congress,telangana congress news,latest telangana election news,Trendingandhra

ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా వుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. టీఆర్ఎస్ ను ఓడించటమే లక్ష్యంగా ఏర్పాటైన మహాకూటమి లో సీట్ల సర్దుబాటు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే దాకా అలాగే సాగేలా వుంది. ఇవ్వాళ, రేపు అంటూ ఊరిస్తూ లిస్టు మాత్రం ప్రకటించటం లేదు కాంగ్రెస్ అధిష్టానం. అందుకు కారణాలు కూడా లేకపోలేదు.
వేల సంఖ్యలో కాంగ్రెస్ నుండి ఆశావహులు ఉన్న నేపధ్యంలో ముందే లిస్టు ప్రకటిస్తే పార్టీ ఫిరాయింపులు జరిగే అవకాశం ఉందని అందుకే తీరా సమయానికి లిస్టు ఇవ్వాలని ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. లిస్టు ప్రకటన వ్యూహాత్మకంగా లేట్ చేసినా అభ్యర్థుల ప్రచారం లో వెనుక పడుతున్నామనే విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం గమనించటం లేదు అన్నది ఆశావహుల భావన. ఇది ఇలా వుంటే కాంగ్రెస్ అధిష్టానానికి సీనియర్ నాయకులు కొందరు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు ఇబ్బందిని కలిగిస్తున్నాయి.
ఇంకా కాంగ్రెస్ పార్టీ త‌మ అభ్య‌ర్థుల్ని ప్ర‌క‌టించ‌నే లేదు అప్పుడే ఆ పార్టీలో ముఖ్యమంత్రి అభ్య‌ర్థి నేనంటే నేనంటూ సీనియర్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి మా జిల్లా వాడంటే లేదు లేదు ముఖ్య‌మంత్రి మా న‌ల్ల‌గొండ జిల్లా నుంచే వ‌స్తాడ‌ని కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి వంటి సీనియ‌ర్ నేత‌లు ప్ర‌క‌టిస్తుండ‌టం మ‌రింత గంద‌ర‌గోళానికి దారి తీస్తోంది.
ఇక ముఖ్య‌మంత్రి ప‌ద‌వికోసం కాంగ్రెస్ నుంచి ఎంత మంది పోటీప‌డుతున్నారో తెలిస్తే కూడా షాక్ అవ్వటం ఖాయం . దశాబ్దాలుగా పార్టీ లో పాతుకుపోయిన సీనియర్ నాయకులు చాలా మంది ముఖ్యమంత్రికి నేనే అర్హుడను అని చెప్పుకోవటం కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. మొదలే లేదంటే సీఎం నేనే అనేదాకా చర్చ పెడుతున్న నేతల తీరుకు అధిష్టానం అవాక్కవుతుంది. అధికారంలోకి రావటానికి అభ్యర్థులను గెలిపించే పని చెయ్యటం మాని ఎవరికి వారు నేనంటే నేను సీఎం అని చెప్పటం హాస్యాస్పదమే.

#TelanganaLatestPoliticsInCongress #TelanganaCongress #TelanganaCongressNews #LatestTelanganaElection news