ఆ ఒక్కటే అడగొద్దు ఇదే ఫైనల్ ….తెలుగుతమ్ముళ్ళకు చెప్పిన బాబు

telangana tdp latest news,telangana latest news,telangana tdp latest politics,telangana tdp latest news,telangana tdp latest political news,trendingandhra

ఏపీ సీఎం చంద్రబాబు ఎవ్వరూ ఊహించని విధంగా తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బుద్ధి చెప్పటానికి రంగంలోకి దిగారు. మహాకూటమి పొత్తులతో కలిసొచ్చే పార్టీలతో గులాబీ పార్టీ కి చెక్ పెట్టాలని చూస్తున్న బాబు టీడీపీ శ్రేణులతో చాలా సీరియస్ గా ఒక విషయం చెప్పారు. కూటమి సీట్ల సర్దుబాటు విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన తెలుగు తమ్ముళ్ళను బాబు ఆ ఒక్క మాట చెప్పి దిస్ ఈజ్ ఫైనల్ అనేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ చీఫ్ ఎల్.రమణ నేతృత్వంలో నేతలు భేటీ అయ్యారు. బాబును సీట్ల విషయంలో కన్విన్స్ చెయ్యాలని చూసిన నాకులకు బాబు ఒక్కటే చెప్పారు. తెలంగాణలో పోటీ చేయనున్న సీట్లు, అనుసరించాల్సిన వ్యూహాల పై చర్చిం చిన బాబు కేసీఆర్ ని ఓడించాలంటే ఆ ఒక్కటి అడగొద్దని చెప్పేశారు.
మహాకూట‌మిలో భాగమైన‌.. టీటీడీపీ నేత‌లు 17 సీట్లు వ‌ర‌కు కోరుతుండ‌గా కాంగ్రెస్ 14 సీట్లు ఇవ్వ‌డానికి ఒప్పుకుంది. ఈ విషయంలో కాస్త అసంతృప్తి తో ఉన్న టీడీపీ నేతలు బాబు వద్ద ఈ అంశాన్ని ప్ర‌స్తావించ‌గా వ‌చ్చే ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థుల విజయమే ముఖ్యమనీ, సీట్ల సంఖ్యను పట్టించుకోవద్దని చంద్రబాబు స్పష్టం చేశార‌ని తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ఫైన‌ల్ జాబితా వ‌స్తుంద‌ని.. అభ్య‌ర్ధుల పేర్ల పై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉందని చెప్పారు.
దీంతో ఎవ‌రైనా అసంతృప్తులు ఉంటే తాను మాట్లాడ‌తాన‌ని సీట్లు విష‌యం మాత్రం అడ‌గొద్ద‌ని ఇదే ఫైన‌ల్ అంటూ చంద్ర‌బాబు స‌మావేశాన్ని ముగించి వెళ్ళిపోయారు. నిరాశకు గురైన తెలుగు తమ్ముళ్ళు బాబు మాటే ఫైనల్ కావటంతో సైలెంట్ గా వెళ్ళిపోయారు.