టాలీవుడ్ హీరోయిన్స్ తీసుకునే రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

telugu actress remuneration list,trendingandhra
సినిమా ఇండ‌స్ట్రీ స‌క్సెస్ చుట్టూ తిరుగుతుంది. ఒక్క హిట్ త‌ల రాత‌ను మార్చేస్తుంది. ఒక్క స‌క్సెస్‌తో రెమ్యున‌రేష‌న్ ల‌క్ష‌ల్లో పెరిగిపోతుంది. ఒక్కోసారి కోటికి ప‌డ‌గ‌లెత్తొచ్చు. ల‌క్ తొక్కి రావ‌డం అంటే ఎలా ఉంటుందో ముద్దు గుమ్మ‌ల రెమ్యున‌రేష‌న్ తెలిస్తే అర్ధ‌మ‌వుతుంది. 
 
గీత గోవిందం త‌రువాత ర‌ష్మిక పేరు మారుమోగిపోయింది. చ‌లో మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై ఆ త‌రువాత గీతా గోవిందం, దేవ‌దాసులో న‌టించింది. చేసింది మూడు సినిమాలే అయినా, ప‌ర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకుంది. గోల్డెన్ లెగ్ ముద్ర ప‌డ‌టంతో స్టార్స్  దృష్టి ఈ అమ్మ‌డుపై ప‌డింది. గ్లామ‌ర్‌కు చోటు లేకుండా కేవ‌లం ప‌ర్ఫామెన్స్‌తో ఫిదా చేసిన హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి. ఫిదా, ఎంసీఏ వంటి వ‌రుస హిట్స్‌తో ల‌క్కీ హీరోయిన్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. దాంతో ఈ అమ్మ‌డు ముందు ఆఫ‌ర్స్ క్యూ క‌డుతున్నా.. క‌థా, క్యారెక్ట‌ర్ న‌చ్చితేనే ఓకే చేస్తూ, ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ స‌ర‌స‌న రెండు స‌నిమాలు చేస్తూ ఒక్కో సినిమాకు కోటి తీసుకుంటుంది సాయి ప‌ల్ల‌వి. 
 
స‌మంత స్టార్స్ ప‌క్క‌న న‌టించ‌డం లేదు కానీ, ఆ ఛాన్స్ వ‌స్తే కోటికి పైగానే తీసుకుంటుంద‌ట‌. ఇక రాశీఖ‌న్నా రెమ్యున‌రేష‌న్ 40 నుంచి 50 ల‌క్ష‌ల మ‌ధ్య న‌డుస్తుంది. సాధార‌ణంగా కోటి కంటే త‌క్కువే తీసుకునే కీర్తి సురేష్ మ‌హాన‌టి కోసం కోటికిపైగానే తీసుకుంద‌ని టాక్‌. 
telugu actress remuneration list,trendingandhra
త‌మ‌న్నా ఆ మ‌ధ్య నా నువ్వే మూవీలో క‌ళ్యాణ్‌రామ్ స‌ర‌సన న‌టించింది. ఈ అమ్మ‌డుకు పెద్ద‌గా ఛాన్స్‌లు లేకున్నా ఏరికోరి తీసుకుంటే ఊహించ‌నంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంది. నా నువ్వే పేరు చెప్పుకుని కోటి 60 ల‌క్ష‌ల‌ను వెన‌కేసుకుంద‌ట త‌మ‌న్నా. యంగ్ హీరో ప‌క్క‌న న‌టిస్తారా..? అని అడిగితే అట‌కెక్కి కావాల్సినంత రాబ‌ట్టే మ‌రో హీరోయిన్ కాజ‌ల్‌. ఛాన్స్‌లు రాకున్నా ప‌ర్వాలేదు ఖాళీగా అయినా కూర్చుంటుంది కానీ, పారితోష‌కం మాత్రం త‌గ్గ‌దు. ఇలా ఉన్న టైమ్‌లో భారీ రెమ్యున‌రేష‌న్ ఇచ్చి ఖైదీ నెం.150లో చిరంజీవికి జోడీగా సెలెక్ట్ చేశారు. కాజ‌ల్ ప్ర‌స్తుతం బెల్లంకొండ సురేష్ ప‌క్క‌న రెండు సినిమాలు చేస్తోంది. ఒకే హీరోతో వ‌రుస‌గా రెండు సినిమాలు అంటే ఎవ‌రైనా వెన‌క్కు త‌గ్గుతారు. ఈ అమ్మ‌డు కెరీర్‌లో హ‌య్యెస్ట్ రెమ్యున‌రేష‌న్ ద‌క్క‌డంతో ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌ను వ‌దులుకునేందుకు ఇష్ట‌ప‌డ‌లేదు. ఒక్కో మూవీకి కోట‌న్న‌ర‌పైగా ముడుతోంద‌ట కాజ‌ల్‌కు.
 
 
ఇక సౌత్ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరోయిన్ న‌య‌న మాత్ర‌మే. ప్రస్తుతం తెలుగులో సైరా న‌ర‌సింహారెడ్డి మూవీలో నటిస్తోంది. దీనికంటే ముందు బాల‌య్య‌తో జ‌త‌క‌ట్టిన జ‌య సింహా కోస 2 కోట్ల 60 ల‌క్ష‌లు తీసుకుంద‌ని ప్రచారం జ‌రిగింది. వ‌రుస‌పెట్టి స్టార్ హీరోలంద‌రితో న‌టించి ఆ వెంట‌నే ఒక్క ఆఫ‌ర్ కూడా లేక‌పోతే ఎలా ఉంటుందో ర‌కుల్‌ను చూస్తే తెలుస్తుంది. ఫామ్‌లో ఉన్న టైమ్‌లో కోటి తీసుకుని  ఆ త‌రువాత 80 ల‌క్ష‌ల‌కు వ‌చ్చిన ర‌కుల్ ప్ర‌స్తుతం మ‌రింత డిస్కౌంట్ ఇచ్చి 60 ల‌క్ష‌లు తీసుకుంటుంద‌ని సమాచారం. రెమ్యున‌రేష‌న్ ఎక్క‌డ పెంచాలో కాదు ఎప్పుడు త‌గ్గించాలో ర‌కుల్‌కు బాగా తెలుసు. 
 
కెరీర్ మొద‌ట్లో వ‌రుస ఫ్లాప్‌లు చూసిన పూజాహెగ్దే దువ్వాడ జ‌గ‌న్నాథం రిలీజ్ త‌రువాత జాత‌కం మారిపోయింది. అర‌వింద స‌మేత హిట్‌తో తొలి స‌క్సెస్‌ను వెన‌కేసుకుంది. ప్ర‌స్తుతం మ‌హ‌ర్షిలో మ‌హేష్‌తో మ‌రో సినిమాలో ప్ర‌భాస్‌తో జ‌త‌క‌డుతూ పెద్ద హీరోల‌తోపాటు పెద్ద‌గానే రెమ్యున‌రేష‌న్‌ను వెన‌కేసుకుంది. ముంబై నుంచి వ‌చ్చిన మ‌రో మీరోయిన్ కైరా అద్వాణీ. తొలి అడుగులోనే భ‌ర‌త్ అనే నేనులో మ‌హేష్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసి స్టార్ ఇమేజ్‌ను ద‌క్కించుకుంది. భ‌ర‌త్ అనే నేను రిలీజ్ కాకుండానే రామ్‌చ‌ర‌ణ్ బోయ‌పాటి సినిమా విన‌య విధేయ రామ‌లో ఛాన్స్ అందుకుని 50 ల‌క్ష‌లు డిమాండ్ చేసింది కైరా. ఇలా ఒక్క స‌క్సెస్‌తో కుదిరితే కోట్ల‌లో, కుద‌ర‌కుంటే ల‌క్ష‌ల్లో పెంచేస్తున్నారు ముద్దుగుమ్మ‌లు.
telugu actress remuneration list,trendingandhra